ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 9PM

.

By

Published : Oct 18, 2021, 8:59 PM IST

TOP NEWS
TOP NEWS

  • కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలి: సీఎం జగన్
    కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలని సీఎం జగన్‌(cm jagan) ఆదేశించారు. కొవిడ్‌తో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని స్పష్టం చేశారు. నవంబరు 30లోగా కారుణ్య నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • బడ్జెట్ బోల్తా.. ఆదాయాన్ని మించిన అప్పులు.. పథకాల సంగతేెంటి?
    అప్పుచేసి పప్పు కూడు తినడం నోటికి చాలా రుచిగా ఉంటుంది.. కానీ.. మళ్లీ ఆకలి వేస్తుంది. మళ్లీ అప్పు తెచ్చుకు తింటే? జేబుకు భారమవుతుంది. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇలాగే ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'వైకాపాకు సొంత ఖజానా నింపుకోవాలనే ఆరాటమే.. అభివృద్ధి పట్టడం లేదు'
    హిందూపురం ప్రభుత్వాసుపత్రిని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో అందుతున్న సౌకర్యాలను రోగులను అడిగి తెలుసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఉద్యోగుల సమస్యలపై.. ఈనెల 21న అన్ని శాఖల కార్యదర్శులతో సీఎస్ భేటీ
    ఈనెల 21న మధ్యాహ్నం సీఎస్ అధ్యక్షతన.. అన్ని శాఖల కార్యదర్శులతో భేటీ కానున్నారు. ఉద్యోగుల సమస్యలపై చర్చించనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • భారత సైన్యం చేతికి 'త్రిశూలం'.. చైనాకు ఇక 'షాక్​'!
    చైనాకు షాక్‌ ట్రీట్‌మెంట్‌ ఇచ్చేందుకు భారత బలగాలు సిద్ధమయ్యాయి. గల్వాన్‌ ఘర్షణలో భారత సైన్యంపై ఇనుప రాడ్ల తరహా ఆయుధాలతో.. డ్రాగన్‌ మూకలు దాడికి తెగబడ్డాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • వరదలతో కేరళ విలవిల- శబరిమలకు నో ఎంట్రీ!
    కేరళలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. పథనంతిట్ట, కొట్టాయం, కొల్లం, ఇడుక్కి జిల్లాలోని జలాశయాల​ గేట్లను అధికారులు ఎత్తేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • బంగ్లాదేశ్​లో ఆగని అల్లర్లు.. 86 ఇళ్లు ధ్వంసం
    దుర్గా పూజల వేళ బంగ్లాదేశ్​లో చెలరేగిన అల్లర్లు సద్దుమణగటం లేదు. హిందూ ఆలయాలపై దాడిని నిరసిస్తూ మైనారిటీ కమ్యూనిటీలు నిరసనలు చేస్తున్న క్రమంలో అల్లరి మూకలు హిందువుల ఇళ్లపై దాడులకు పాల్పడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఐఫోన్ తయారీ సంస్థ నుంచి ఎలక్ట్రిక్ కార్లు, బస్సులు
    యాపిల్ కంపెనీకి ఐఫోన్లు తయారు చేసిపెట్టే ఫాక్స్​కాన్ సంస్థ.. ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయనున్నట్లు ప్రకటించింది. ఆటోమొబైల్ కంపెనీల కోసం కాంట్రాక్టు పద్ధతిలో ఎలక్ట్రిక్ కార్లు, బస్సులను ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ప్రకాశ్​రాజ్ ప్యానెల్ రాజీనామాలు అందలేదు: విష్ణు
    'మా' అధ్యక్షుడిగా అన్ని విధాల కృషి చేస్తానని మంచు విష్ణు అన్నారు. ప్రకాశ్​రాజ్ ప్యానెల్ సభ్యుల రాజీనామాలు తనకు ఇంకా అందలేదని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details