- తక్కువ వడ్డీలకు బ్యాంకులు విరివిగా రుణాలు ఇవ్వాలి: సీఎం జగన్
CM Jagan with Bankers: ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలకు బ్యాంకులు సహకరించాలని ముఖ్యమంత్రి జగన్ బ్యాంకర్లను కోరారు. 219 వ రాష్ట్ర స్ధాయి బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడిన ఆయన.. తక్కువ వడ్డీలకు బ్యాంకులు విరివిగా రుణాలు ఇవ్వాలన్నారు.
- లోకేశ్ జూమ్ మీటింగ్‌లో వైకాపా ఎమ్మెల్యేలు వంశీ, కొడాలి నాని
Lokesh: పదోతరగతి ఫలితాల్లో ఉత్తీర్ణతశాతం తగ్గడంపై విద్యార్థులతోనూ, ఫెయిలై చనిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులతో నారా లోకేశ్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఆ కార్యక్రమంలో వైకాపా ఎమ్మెల్యేల, మాజీ మంత్రులు, నేతలు రావడంపై లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
- పీఆర్సీ జీవోలో మార్పులు చేయకపోతే.. రాష్ట్రవ్యాప్త ఆందోళనలు: ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక
RTC LETTER: పీఆర్సీ జీవోల వల్ల ఆర్టీసీ ఉద్యోగులకు నష్టం జరుగుతోందని ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక నాయకులు వెల్లడించారు. ఈ మేరకు ఆర్టీసీ ఉద్యోగులు సీఎం జగన్‌కు లేఖ రాశారు. తమ సమస్యలను సత్వరమే చర్చించి పరిష్కరించాలని.. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగనున్నట్లు ఉద్యోగులు స్పష్టం చేశారు.
- ఎన్టీఆర్.. 3 అక్షరాలు తెలుగుజాతికి అపూర్వశక్తి: సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
నందమూరి తారక రామారావు ఓ సమున్నత మానవతామూర్తి అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా తెలుగు ప్రజలు.. పార్టీలు, రాజకీయాలు, ప్రాంతాలకు అతీతంగా కృషి చేయాలని కోరారు. ఎన్టీఆర్‌కు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గౌరవం లభించేలా చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
- జులై 18న రాష్ట్రపతి ఎన్నిక.. 21న ఓట్ల లెక్కింపు
దేశ 16వ రాష్ట్రపతి ఎన్నికలకు నగారా మోగింది. దిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. ఎన్నికలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
- 'ఆలస్యం ఏం లేదు.. రెండు రోజుల్లో వానలే వానలు'
IMD Monsoon: నైరుతి రుతుపవనాల్లో జాప్యమేమీ లేదని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే కేరళలోకి ప్రవేశించాయని, మహారాష్ట్ర సహా కర్ణాటక, తమిళనాడుల్లో మరో రెండు రోజుల్లో పురోగతి కనిపిస్తుందని, వర్షాలు కురుస్తాయని తెలిపారు ఐఎండీ శాస్త్రవేత్త ఆర్కే. జేనామణి.
- హిందూ దేవాలయంపై దాడి.. 'పాక్' దుండగుల దుశ్చర్య
Hindu Temple: ఓ హిందూ దేవాలయంపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆలయంలోని విగ్రహాలను ధ్వంసం చేశారు. ఆరు లేదా ఎనిమిది మంది దుండగులు ద్విచక్రవాహనాలపైన వచ్చి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని స్థానికులు వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఘటనాస్థలం సమీపంలో భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. ఈ ఘటన పాకిస్థాన్‌లో జరిగింది.
- ఆగని పతనం... జీవితకాల కనిష్ఠానికి రూపాయి
Rupee value today: రూపాయి మారకం విలువ జీవితకాల కనిష్ఠాన్ని నమోదు చేసింది. డాలరుతో పోలిస్తే 13 పైసలు నష్టపోయిన రూపాయి.. 77.74 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు, క్రూడ్ ఆయిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి.
- ప్రపంచ రికార్డు బ్రేక్.. చరిత్రలోనే అతిపెద్ద విజయం
Ranji Trophy 2022: ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో చరిత్ర సృష్టించింది దేశవాళీ మేటి జట్టు ముంబయి. గురువారం ఉత్తరాఖండ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ప్రపంచ రికార్డును బ్రేక్ చేసింది. అత్యధికంగా 725 పరుగుల తేడాతో గెలిచి సెమీ ఫైనల్లోకి అడుగుపెట్టింది.
- 'ఎన్బీకే107' టీజర్లో బాలయ్య గర్జన.. మాస్ డైలాగులతో ఫ్యాన్స్‌కు పూనకాలు!
NBK 107 Teaser: శుక్రవారం (జూన్ 10) తన పుట్టినరోజు సందర్భంగా ఒక రోజు ముందుగానే అభిమానులకు అదిరిపోయే కానుక అందించారు నందమూరి బాలకృష్ణ. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. మాస్ డైలాగులతో టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది.