ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 AM

ప్రధాన వార్తలు @ 9 AM

By

Published : Jan 17, 2021, 9:00 AM IST

Top News
ప్రధాన వార్తలు

  • తొలి రోజున దేశవ్యాప్తంగా 1.91 లక్షల మందికి వ్యాక్సిన్

ప్రధాని నరేంద్ర మోదీ శనివారం కొవిడ్‌ టీకాలు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆక్స్‌ఫర్డ్‌/ఆస్ట్రాజెనెకా సాయంతో సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాలో రూపొందించిన ‘కొవిషీల్డ్‌’, భారత్‌ బయోటెక్‌లో స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన ‘కొవాగ్జిన్‌’ టీకాలను అత్యవసర వినియోగం నిమిత్తం వాడుకలోకి తెచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కొవిన్ పోర్టల్​ ఇంతలా ఉపయోగపడుతుందా?

కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ఆసాంతం పర్యవేక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొ-విన్‌ పోర్టల్‌.. ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంది. డేటా సేకరణ, విశ్లేషణకు ఇది మున్ముందు అత్యంత కీలకం కానుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కూలీల ఆటో బోల్తా.. మహిళ మృతి.. ఐదుగురి పరిస్థితి విషమం

అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణ శివారులోని జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొనకొండ్ల సమీపంలో కూలీల ఆటో బోల్తా పడగా మహిళ మృతి చెందింది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • భార్గవరామ్​ బడిలోనే పథక రచన!

హైదరాబాద్​లో కలకలం సృష్టించిన ప్రవీణ్‌రావు సోదరుల అపహరణ కేసులో బోయిన్‌పల్లి పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. యూసుఫ్‌గూడలో భార్గవరామ్‌ నిర్వహిస్తున్న ఎంజీఎం ఇంటర్నేషనల్‌ స్కూల్లోనే కిడ్నాప్‌కు పథక రచన జరిగిందని గుర్తించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రాజ్యసభలో పెరిగిన ప్రాంతీయ భాషల వినియోగం

రాజ్యసభ ఛైర్మన్‌గా వెంకయ్య నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేశ సమాఖ్య స్ఫూర్తికి తగినట్లు తమ మాతృ భాషల్లో సభలో మాట్లాడాలని, చర్చల్లో భాగస్వాములు కావాలని సూచించారు. ఈ అవకాశాన్ని సభ్యులు అందిపుచ్చుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కస్టమ్స్‌ సుంకం రద్దుచేసి ఆదుకోండి

కరోనా నేపథ్యంలో వార్తా పత్రికలకు ఉపయోగించే కాగితం ధర భారీగా పెరిగింది. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే ప్రింటింగ్​ కాగితంపై సుంకాన్ని ఎత్తివేయాలని ఇండియన్‌ న్యూస్‌ పేపర్‌ సొసైటీ వర్గాలు కేంద్రాన్ని కోరుతున్నాయి. ఈ మేరకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​కు వినతిపత్రాన్ని అందించాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బైడెన్​ ప్రమాణం ముందర.. మారణాయుధాల కలకలం

అమెరికా నూతన అధ్యక్షుడి​ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కొన్ని గంటలే సమయం ఉండగా.. వాషింగ్టన్​ ప్రాంతంలో తుపాకీతో ఓ వ్యక్తి కనిపించడం ఆందోళనకు దారితీసింది. ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి, తుపాకీ సహా 500 రౌండ్ల మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఏవీ ఈవీ పరుగులు- ఫేమ్‌-2 లక్ష్యానికి ఎంతో దూరం

విద్యుత్‌ వాహనాల వాడకం సుదూర లక్ష్యంగా కనిపిస్తోంది. వీటిని ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ఒక పథకాన్ని తీసుకువచ్చి దాదాపు రెండేళ్లవుతున్నా.. ఇంకా గట్టి అడుగులు పడటం లేదు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో వీటి విక్రయాలు పెరగాల్సింది కానీ అలా జరగలేదు. ఎందుకు? వీటికి ఎదురవుతున్న అడ్డంకులు ఏమిటి? భవిష్యత్‌ మాటేమిటి? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బ్రిస్బేన్​ టెస్టు: లంచ్​ విరామానికి టీమిండియా 161/4

ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు మూడో రోజు ఆటలో భోజన విరామ సమయానికి భారత్​ నాలుగు వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. క్రీజులో మయాంక్​ అగర్వాల్​(38), పంత్​(4) ఉన్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'ఇండస్ట్రీలో నాకు పోటీ ఎవరో తెలుసుకున్నా!'

చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన 15 ఏళ్ల తర్వాత తనకు పోటీ ఎవరనేది తెలిసిందని అంటున్నారు యువ కథానాయకుడు రామ్​ పోతినేని. ఆయన హీరోగా నటించిన 'రెడ్​' చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకుల నుంచి విశేషాదరణ దక్కించుకుంటోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details