ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @7PM

..

TOP NEWS @7PM
ప్రధాన వార్తలు @7PM

By

Published : Aug 29, 2021, 7:02 PM IST

  • Corona cases: రాష్ట్రంలో కొత్తగా 1,557 కరోనా కేసులు, 18 మరణాలు
    రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 64,550 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1,557 కేసులు నిర్ధారణ అయ్యాయి. కొవిడ్‌ మహమ్మారి బారినపడి మరో 18 మంది మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 13,825కి చేరింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Kishan Reddy: 'క్రీడాకారుల్లోని ప్రతిభను గుర్తించి ఒలింపిక్స్‌కు పంపుతాం'
    జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణలోని ఉస్మానియా వర్సిటీలో నిర్మించబోతున్న స్పోర్ట్స్ క్లస్టర్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Rahul Murder Case: రాహుల్‌ హత్య కేసులో మరో నలుగురు అరెస్టు
    రాహుల్ హత్య కేసులో పోలీసులు మరింత వేగం పెంచారు. తాజాగా మరో నలుగురిని అరెస్ట్ చేశారు. హత్యకు ముందు నిందితులు.. రాహుల్‌ను తిప్పిన ప్రదేశాలను సీజ్‌ చేశారు. ఇందులో కోరాడ చిట్‌ఫండ్స్‌, దుర్గా కళామందిర్‌ థియేటర్‌ ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Visakha Airport: రద్దీగా మారుతున్న విశాఖ విమానాశ్రయం..
    గత ఏడాది కొవిడ్‌తో ఒక్కసారిగా పడిపోయిన ప్రయాణికుల సంఖ్య, గత డిసెంబరుకు అత్యధిక సంఖ్యకు చేరుకుంది. ఈ ఏడాది కూడా రెండో విడత కొవిడ్‌ ధాటికి బాగా తగ్గిన ప్రయాణాలు.. ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Ayodhya News: 'శ్రీరాముడు లేకుండా అయోధ్య లేదు'
    ఉత్తర్​ప్రదేశ్‌లోని అయోధ్యను(Ayodhya News) సందర్శించారు రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​. శ్రీరాముడు, అయోధ్య నగర ప్రాముఖ్యతను కొనియాడారు. రాముడు ఎక్కడ ఉంటే అక్కడే అయోధ్య అని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'అఫ్గాన్ పరిణామాలతో వ్యూహాలు మార్చాం'
    అఫ్గానిస్థాన్​లో మారిపోతున్న సమీకరణాలు భారత్​కు సవాలుగా పరిణమించినట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్ సింగ్(rajnath singh) పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తన వ్యూహాలను మార్చినట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • అఫ్గాన్ రాజధాని కాబుల్​లో మరో పేలుడు!
    అఫ్గానిస్థాన్​ రాజధాని కాబుల్​లో భారీ పేలుడు సంభవించినట్లు అక్కడి మీడియా తెలిపింది. ఉగ్రదాదులు మరోసారి దాడి చేస్తారని అమెరికా హెచ్చరించిన కొన్ని గంటల్లోనే ఈ ఘటన చోటు చేసుకుంది. కాబుల్ విమనాశ్రయాన్ని పౌరులందరూ ఖాళీ చేయాలని అగ్రరాజ్యం ఇప్పటికే సూచించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పారాలింపిక్స్​లో భారత్​కు మరో పతకం.. వినోద్​కు కాంస్యం
    టోక్యో పారాలింపిక్స్‌లో(Tokyo Paralympics) భారత్​కు మరో పతకం లభించింది. ఆదివారం జరిగిన డిస్కస్​ త్రో ఎఫ్ 52 పోటీలో వినోద్​ కుమార్ కాంస్యం సాధించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • భారత్‌కు మరో రజతం.. హైజంప్‌లో మెరిసిన నిషాద్‌ కుమార్‌
    టోక్యో పారాలింపిక్స్‌లో(Tokyo Paralympics) భారత్‌కు మరో రజత పతకం దక్కింది. ఆదివారం జరిగిన పురుషుల హైజంప్‌ పోటీల్లో టీ47 కేటగిరిలో భారత అథ్లెట్‌ నిషాద్‌కుమార్‌ 2.06 మీటర్ల ఎత్తు జంప్​ చేసి రెండో స్థానంలో నిలిచాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • RRR movie: హైదరాబాద్‌ వీధుల్లో హాలీవుడ్​ భామ సందడి
    'ఆర్‌ఆర్‌ఆర్‌'లో(RRR Movie) నటిస్తున్న హాలీవుడ్‌ భామ ఒలీవియా మోరీస్‌ హైదరాబాద్‌ వీధుల్లో సందడి చేశారు. శిల్పారామం కూడా వెళ్లి వచ్చారు. తన రోజు ఎంతో సంతోషంగా గడిచిందంటూ ఇన్​స్టాలో ఫొటోలు పోస్ట్​ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details