ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @7PM - prime news

..

top news
ప్రధాన వార్తలు @7PM

By

Published : Apr 15, 2021, 7:06 PM IST

  • 'జగన్‌ బెయిల్‌ రద్దు' పిటిషన్‌పై.. ఈ నెల 22న సీబీఐ కోర్టు విచారణ!
    జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్​ను హైదరాబాద్​ నాంపల్లి సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. పిటిషన్ పై ఈనెల 22న విచారించనుంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కరోనా సెకండ్ వేవ్: రాష్ట్రంలో ఒక్కరోజులో.. 5 వేలు దాటిన కొవిడ్ కేసులు
    రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతుంది. సెకండ్‌ వేవ్‌లో తొలిసారిగా 5 వేల కేసులు దాటాయి. కొత్తగా 5,086 కరోనా కేసులు నమోదవ్వగా 14 మంది వైరస్​కు బలయ్యారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • విశాఖలో 6 హత్యల కేసు.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..!
    విశాఖను గజ.. గజ.. వణికేలా చేసిన ఆరు హత్యల కేసు మరో కోణంలోకి వెళ్లింది. ఈ కేసును తవ్వుతుంటే.. ట్విస్ట్​ల మీద ట్విస్టులు బయటకు వస్తున్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా హత్యలు చేసిన నిందితుడు చెబుతున్న విషయాలు.. అవాక్కయ్యేలా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • జుత్తాడలో తీవ్ర ఉద్రిక్తత.. హోంమంత్రి, కలెక్టర్​ రావాలంటున్న మృతుల బంధువులు
    విశాఖ జిల్లా జుత్తాడలో ఉద్రిక్తత నెలకొంది. హత్య సమాచారం తెలుసుకున్న మృతుల కుటుంబీకులు... ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • విదేశీ అధికారులతో మోదీ భేటీలు రద్దు!
    దేశంలో కరోనా విజృంభణ కారణంగా ప్రధాని మోదీతో విదేశీ ఉన్నతాధికారుల భేటీలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. ముందుగా కుదిరిన షెడ్యూల్​లను నిలిపివేస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. వైరస్​పై ప్రధాని నిరంతరం సమీక్షలు జరుపుతున్న వేళ కొద్ది రోజుల తర్వాతే వారితో సమావేశాలు ఉంటాయని తెలుస్తోంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'అడ్డంకులు తొలగించి టీకా ఉత్పత్తి పెంచాలి'
    కరోనా టీకాల ఉత్పత్తిని మరింత వేగవంతం చేయడానికి తగిన పరిస్థితుల్ని సృష్టించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. అడ్డంకులను తాత్కాలికంగా తొలగించాలని ప్రపంచ వాణిజ్య సంస్థకు సూచించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఐరోపాలో 10 లక్షలు దాటిన కరోనా మృతులు
    ఐరోపాలో 10 లక్షలకు పైగా బాధితులు కరోనాకు బలయ్యారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. మరణాలను నివారించడం సహా, వైరస్​ను ఎదుర్కోవడంలో ఆస్ట్రాజెనెకా టీకా సమర్థవంతంగా పనిచేస్తోందని తెలిపింది. కాబట్టి వ్యాక్సిన్​పై అనుమానం వీడాలని స్పష్టం చేసింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • రూ.15 వేల లోపు ఉత్తమ స్మార్ట్​ఫోన్లు ఇవే!
    ప్రస్తుతం బడ్జెట్ స్మార్ట్​ఫోన్లకు కొదవే లేదు. అన్ని ఫోన్ల ఫీచర్లు దాదాపు ఒకేలా కనిపిస్తాయి. దీని వల్ల బడ్జెట్ ఫోన్​ కొనాలనుకునే వారికి ఏ మోడల్ సరైందో ఎంచుకోవడం కష్టంగా మారింది. అలాంటి వారి కోసం బడ్జెట్​ సెగ్మెంట్​లో కొన్ని ఉత్తమమైన ఫోన్లు, వాటి ఫీచర్లు, ఇతర వివరాలతో ఓ ప్రత్యేక కథనం.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్​షిప్​ ఫైనల్లో సరిత
    భారత మహిళా రెజ్లర్ సరితా మోర్​.. ఆసియా ఛాంపియన్​షిప్​ తుదిపోరుకు అర్హత సాధించింది. కాంస్యం కోసం సీమ- పూజ.. మ్యాచ్​ ఆడనున్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • రామ్​ సినిమాకు డీఎస్పీ.. ​టీజర్​ టైమ్​తో 'గల్లీరౌడీ'
    కొత్త సినిమా కబుర్లు వచ్చేశాయి. ఇందులో 'గల్లీ రౌడీ' టీజర్, రామ్​ సినిమాకు సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్, అల్లు శిరీష్ అల్బమ్ సాంగ్​కు సంబంధించిన సంగతులు ఉన్నాయి.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details