- కాలుదువ్వుతున్న కోళ్లు... కోట్లల్లో నడుస్తున్న పందేలు
సంక్రాంతి సందర్భంగా ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. వందల సంఖ్యలో కోడి పందేల బరులు వెలిశాయి. వేల సంఖ్యలో వస్తున్న పందెంరాయుళ్లతో బరులు తిరునాళ్లను తలపిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పండగ రోజూ పోరాటం.. రాజధాని కోసం రైతుల ఆరాటం
ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ.. రైతులు, మహిళలు చేస్తున్న నిరసనలు 394వ రోజుకు చేరాయి. గుంటూరు జిల్లా ఉద్ధండరాయునిపాలెంలో గ్రామ దేవతకు ఆందోళనకారులు పొంగళ్లు సమర్పించారు. అనంతవరంలో చిన్నారులు హరిదాసు వేషం వేసి అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సంక్రాంతి సంబరాల్లో.. పొట్టేళ్ల పందేలు
సంక్రాంతి సంబరాల్లో భాగంగా కోడి పందాలు, పొట్టేళ్ల పందేలు జోరుగా సాగుతున్నాయి. ప్రకాశం జిల్లా పర్చూరు మండలం అన్నంబొట్లవారిపాలెంలో పొట్టేళ్ల పందాలు జరిగాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆలయాలపై దాడులకు రామతీర్థం ఘటన పరాకాష్ఠ: చినజీయర్ స్వామి
ఆలయాలపై దాడులకు రామతీర్థం ఘటన పరాకాష్ఠ అని త్రిదండి చినజీయర్ స్వామి అన్నారు. శ్రీ కోదండ రాముని ఆలయాన్ని ఆయన గురువారం సందర్శించారు. ఈనెల 17 నుంచి రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో పర్యటిస్తానని తెలిపారు. ఏడాదిలోగా ప్రతి ఆలయంలో రక్షణ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సాగు చట్టాలపై జల్లికట్టులో నిరసన
తమిళనాడులో సంక్రాతి రోజు నిర్వహించే జల్లికట్టులో నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన చేపట్టారు. వెంటనే స్పందించిన పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- లద్దాఖ్ ప్రతిష్టంభన ఇంకా వీడంది ఇందుకే...