- సమస్యలపై ప్రజల ప్రశ్నల వర్షం.. చెవులు మూసుకున్న ఎమ్మెల్యే
MLA Sudheer Reddy: 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి సమస్యల సెగ తాకింది. బోరు బావి సమస్య పరిష్కరించాలని మహేశ్వరనగర్‌కు చెందిన మహిళలు ఎమ్మెల్యేను నిలదీశారు.
- సతీష్‌రెడ్డి నిర్ణయమేంటి..? అభిమానుల్లో ఉత్కంఠ
Kadapa News: శాసన మండలి మాజీ డిప్యూటీ ఛైర్మన్ సతీష్ రెడ్డి రాజకీయ నిర్ణయంపై అనిశ్చితి నెలకొంది. తెదేపాలోకి రావాలంటూ.. ఆయన అనుచరులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయంగా ఏం నిర్ణయం తీసుకుంటారో అనేది జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
- వైకాపా పేరును అలా మార్చుకుంటే మంచింది: జీవీఎల్
GVL on YSRCP: అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. వైకాపా పేరును వైఫల్యం చెందిన పార్టీగా మార్పు చేసుకోవాలని సూచించారు. వైకాపా పాలకులు అభివృద్ధిని, ప్రజలను అగాథంలోకి నెట్టి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో పడేశారన్నారు.
- TDP: ఫేక్ ట్వీట్లు, సోషల్ మీడియాలో ప్రచారంపై తెదేపా సీరియస్
TDP planning to booklet with Fake Tweets: తెలుగుదేశం పార్టీ నేతలు లక్ష్యంగా ఫేక్ ట్వీట్లు, సోషల్ మీడియాలో ప్రచారాన్ని తెలుగుదేశం సీరియస్‌గా తీసుకుంది. అసత్యాలు ప్రచారం చేసిన ఫేక్ న్యూస్‌తో బుక్లెట్ వేసే యోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం. ఆ మేరకు కసరత్తు జరుగుతోందని పార్టీ నేతలు తెలిపారు.
- వెనక్కి తగ్గని కోనసీమ రైతులు.. మండలాల వారీగా క్రాప్ హాలిడే నిరసనలు
Crop Holiday: అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎన్ని చెప్పినా.. ఎంత చెప్పినా.. పంట విరామంపై వెనక్కి తగ్గేది లేదని కోనసీమ జిల్లా రైతులు తేల్చి చెబుతున్నారు.
- అల్‌ఖైదా హెచ్చరికలపై అప్రమత్తం.. కీలక ప్రాంతాలపై నిఘా
al qaeda threat letter: అల్‌ఖైదా ఉగ్రసంస్థ చేసిన ఆత్మాహుతి దాడుల హెచ్చరికలతో కేంద్రం అప్రమత్తమైంది. భాజపా నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు వ్యతిరేకంగా అంతర్జాతీయంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తిన వేళ.. భారత్‌లో ఆత్మాహుతి దాడులు చేస్తామని అల్‌ఖైదా లేఖ విడుదల చేసింది. దీంతో హెచ్చరికలను సీరియస్‌గా తీసుకున్న కేంద్ర దర్యాప్తు, నిఘా సంస్థలు దేశంలోని పలు ప్రాంతాల్లో నిఘాను పటిష్ఠం చేశాయి.
- జహంగీర్‌పురిలో మళ్లీ ఉద్రిక్తత.. రెండు వర్గాల మధ్య రాళ్ల దాడి!
Jahangirpuri Violence: దిల్లీలోని జహంగీర్‌పురిలో మరోమారు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. రెండు వర్గాల మధ్య జరిగిన గొడవ రాళ్ల దాడుల వరకు వెళ్లింది. అల్లర్లకు కారణమైన ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
- డాన్‌బాస్‌పై రష్యా నిప్పుల వర్షం.. ఉపగ్రహ చిత్రాలే సాక్ష్యం!
Ukraine Crisis: ఉక్రెయిన్‌లోని డాన్బాస్ ప్రాంతంలో రష్యా సైనికులు బీభత్సం సృష్టిస్తున్నారు. తాజాగా మాక్సర్ సంస్థ విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాలు ఆ విషయాన్ని తేటతెల్లం చేశాయి. శతఘ్ని గుండ్ల వర్షానికి ధ్వంసమైపోయిన భవనాలు, తూట్లు పడిన పొలాలు ఆ చిత్రాల్లో కనిపిస్తున్నాయి.
- అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న మిథాలీ రాజ్
భారత మహిళా క్రికెట్ వన్డే, టెస్టు కెప్టెన్ మిథాలీరాజ్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకొంటున్నట్టు ట్విటర్ వేదికగా వెల్లడించారు.
- 'రోలెక్స్ సార్'కు కమల్ అదిరిపోయే గిఫ్ట్.. పేరుకు తగ్గట్టే..
'విక్రమ్' సక్సెస్ నేపథ్యంలో మూవీటీమ్‌కు గిఫ్ట్స్‌ను ఇస్తున్న కమల్‌హాసన్.. తాజాగా సూర్యకు ఓ ఖరీదైన కానుక ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సూర్య సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంతకీ కమల్ ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా?