ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 5 PM - ఏపీ ముఖ్యవార్తలు

ప్రధాన వార్తలు @ 5 PM

ప్రధాన వార్తలు @ 5 PM
ప్రధాన వార్తలు @ 5 PM

By

Published : Apr 6, 2021, 4:59 PM IST

  • పరిషత్‌ ఎన్నికలు నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

పరిషత్‌ ఎన్నికలు నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిలిపివేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కోడ్‌ విధించలేదని ఆక్షేపించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బోరు బావుల్లో రసాయనాలు.. వ్యాధుల బారిన పడుతన్న స్థానికులు

బోరు బావుల్లోంచి పూర్తిగా రంగుమారి నురుగు, దుర్వాసనతో వస్తున్న నీటిని చూసి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. రసాయనాలతో మిళితమైన ఆ నీటిని వినియోగించడం వల్ల తీవ్ర అనారోగ్యం పాలవుతున్నామని వాపోతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఎల్జీ పాలిమర్స్ యంత్ర సామగ్రి అమ్మేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ఎల్జీ పాలిమర్స్​కు సంబంధించిన యంత్ర సామగ్రి అమ్మేందుకు హైకోర్టు అనుమతిచ్చింది. ఆ మొత్తాన్ని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • యానాంలో భారీ భద్రత నడుమ.. ప్రశాంతంగా ఓటింగ్​

కేంద్ర పాలిత ప్రాంతం.. పుదుచ్చేరి రాష్ట్ర అసెంబ్లీకి పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. కేంద్రపాలిత యానాంలో 11 గంటల సమయానికి 35 శాతం ఓటింగ్ నమోదు అయిందని రిటర్నింగ్ అధికారి అమన్ శర్మ తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఠాణాలో పోలీసుల నాగిని డ్యాన్సులు

విధినిర్వహణలో ఉన్న పోలీసులు ఏ మాత్రం భయం లేకుండా ఠాణాలోనే స్టెప్పు​లు వేశారు. హోలీ పండుగ సందర్భంగా రంగులు పూసుకుని, బృంద నృత్యాలతో హల్​చల్​ చేశారు. మహిళా సిబ్బందితో కలిసి నాగిని పాటకు డ్యాన్సులు వేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • దేశ్​ముఖ్​ వ్యవహారంలో సుప్రీంకు మహా సర్కార్

మాజీ హోంమంత్రి అనిల్ దేశ్​ముఖ్​పై సీబీఐ విచారణ జరపాలని బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వం కోరింది. హైకోర్టు ఆదేశాలను సవాల్​ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఆద్యంతం ఒడుదొడుకులు- చివరకు స్వల్ప లాభాలు

ఆద్యంతం ఒడుదొడుకుల్లో కొనసాగిన స్టాక్ మార్కెట్లు చివరకు స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 42 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 46 పాయింట్లు పుంజుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

దేశీయంగా పసిడి, వెండి ధరలు కాస్త పెరిగాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర దిల్లీలో రూ.45 వేల పైకి చేరింది. వెండి ధర కిలో రూ.64,600 దాటింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'బయోబబుల్​ కష్టమే.. మనోళ్లకు కాదులే'

బయోబబుల్​లో ఆడటం విదేశీ జట్లకు కష్టతరం కానీ భారత ఆటగాళ్లకు కాదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్​ గంగూలీ అభిప్రాయపడ్డాడు. బయోబబుల్​లో మానసిక సమస్యలను ఎదుర్కోవటంలో భారత ఆటగాళ్లు సహనపరులని అన్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'వకీల్​సాబ్'​ సాంగ్​ వాయిదా​- 'జాతిరత్నాలు' డిలీటెడ్​ సీన్​

పవన్​ 'వకీల్​సాబ్​' సినిమాలోని 'కదులు కదులు' పాట విడుదల వాయిదా పడింది. 'జాతిరత్నాలు' సినిమాలోని మరో డిలీటెడ్​ సీన్​ విడుదలై విపరీతంగా నవ్విస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details