ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP TOP NEWS : ప్రధాన వార్తలు @ 3pm - ఏపీ ముఖ్యవార్తలు

AP TOP NEWS : ప్రధాన వార్తలు @ 3pm

TOP NEWS @ 3PM
ప్రధాన వార్తలు @ 3pm

By

Published : Dec 25, 2021, 2:59 PM IST

  • Yanamala on State Finance: 'రెండున్నరేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అథఃపాతాళానికి నెట్టారు'

Yamanala on State Finance: రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారాయని తెదేపా నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. రాష్ట్రంలో ఆర్ధిక అసమానతలు 38 నుంచి 43శాతానికి పెరిగాయని.. రెండున్నరేళ్లలో జగన్ తన పాలనతో రాష్ట్రాన్ని అథఃపాతాళానికి తీసుకెళ్లారని ధ్వజమెత్తారు.

  • BJP Leaders Fire On YSRCP: 'ఓటు బ్యాంకు రాజకీయాలే లక్ష్యంగా ఏపీలో పాలన'

BJP Leaders Fire On YSRCP: విజయవాడ భాజపా కార్యాలయంలో ఈ పార్టీ నాయకులు వాజ్‌పేయీ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. వాజ్​పేయీ చిత్రపటానికి పూలమాలలు వేసి సోము వీర్రాజు, సునీల్ దేవ్​ధర్ నివాళులర్పించారు.

  • Dump At AOB: ఏవోబీ సరిహద్దులో భారీ డంప్‌.. పేలుడు సామగ్రి, యంత్రాలు స్వాధీనం

ఆంధ్రా-ఒడిశా స‌రిహ‌ద్దుల్లో మావోయిస్టుల‌కు చెందిన భారీ డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జొడొంబో పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని క‌టాఫ్ ఏరియా ప్రాంతంలో.. ఒడిశా మ‌ల్క‌న్‌గిరి పోలీసులు ఇంటెన్సివ్ సెర్చ్, ఏరియా డామినేష‌న్ నిర్వ‌హించగా భారీ డంప్ బయటపడింది. ఈ డంప్‌లో పేలుడు సామగ్రి, యంత్రాలు ఉన్నాయి. వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

  • 'కర్తార్​పుర్​ కారిడార్​తో దేశ ప్రజల కల నెరవేరింది'

Modi in Gurpurab celebrations: కర్తార్​పుర్​ కారిడార్​ ద్వారా కర్తార్​పుర్​ సాహిబ్​ను సులభంగా చేరుకోవాలనే దేశ ప్రజల కల నెరవేరిందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గురునానక్​ దేవ్​ జీ గురుపురబ్​ ఉత్సవాలకు వర్చువల్​గా హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

  • ఒమిక్రాన్​ భయాలు- 10 రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక బృందాలు

Central teams to states: ఒమిక్రాన్​తో పాటు కరోనా కొత్త కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైరస్​ ఉద్ధృతి ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక బృందాలను పంపనుంది. ఆయా రాష్ట్రాల్లో 3-5 రోజుల పాటు పర్యటించి కరోనా కట్టడి చర్యలు, వ్యాక్సినేషన్, ఆసుపత్రుల్లో పడకల లభ్యత వంటి వివిధ అంశాలను పర్యవేక్షించనున్నాయి.

  • ఎస్పీ నేత ఇంట్లో నల్లధనం.. విలువ రూ.177 కోట్లు!

Piyush Jain arrested: పన్ను ఎగవేత ఆరోపణలపై పర్ఫ్యూమ్ వ్యాపారి పీయూష్ జైన్​ను అధికారులు అరెస్టు చేశారు. ఆయన ఇళ్లు, కార్యాలయాల్లో లభించిన నగదును లెక్కించిన అధికారులు.. మొత్తం సీజ్ చేసిన సొమ్మును రూ.177.45 కోట్లుగా తేల్చారు.

  • నౌక ప్రమాదంలో 13 మంది మృతి

Migrant Boat Capsizes: గ్రీస్​లో శుక్రవారం జరిగిన నౌక ప్రమాదంలో 13 మంది మృతిచెందారు. నౌకలో సుమారు 80 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు అంచనా వేశారు. వీరంతా టర్కీ నుంచి ఇటలీకి వలసవెళ్తున్నారని వెల్లడించారు.

  • ఆ అపురూప క్షణాల్ని గొప్పగా ఆవిష్కరించారు: కోహ్లీ

Virat Kohli on 83 movie: 1983 ప్రపంచకప్​లో టీమ్ఇండియా విజేతగా నిలిచింది. ఈ అపూరూప ఘట్టాల్ని తెరపై ఆవిష్కరించిన చిత్రం '83'. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను చూసిన టీమ్ఇండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ.. చిత్రబృందంపై ప్రశంసల జల్లు కురిపించాడు.

  • బిగ్​బాస్​లో 'ఆర్ఆర్ఆర్' బృందం.. ఎన్టీఆర్​-చెర్రీలతో సల్మాన్​ స్టెప్పులు

RRR movie Bigboss: 'ఆర్​ఆర్​ఆర్'​లోని 'నాటు నాటు' పాటకు ఎన్టీఆర్​-చరణ్​లతో కలిసి అదిరిపోయే స్టెప్పులేశారు బాలీవుడ్​ కండలవీరుడు సల్మాన్ ఖాన్​. సినిమా ప్రమోషన్​లో భాగంగా 'బిగ్​బాస్​' షోకు వెళ్లిన 'ఆర్​ఆర్​ఆర్​' చిత్రబృందం సల్మాన్​తో కలిసి సందడి చేసింది.

ABOUT THE AUTHOR

...view details