ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 3 PM - ap top ten news

TOP NEWS: ప్రధాన వార్తలు @ 3 PM

TOP NEWS @ 3PM
ప్రధాన వార్తలు @3PM

By

Published : Jul 15, 2021, 3:00 PM IST

  • parliament session: వైకాపా పార్లమెంటరీ పార్టీ సమావేశం
    త్వరలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో గురువారం వైకాపా పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. వైకాపా లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు సమావేశానికి హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేలా పోరాడతాం: లోకేశ్
    జాబ్ క్యాలెండర్ పేరిట జాదూ క్యాలెండర్ విడుదల చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రభుత్వ తీరును ఆక్షేపించారు. బైబై బాబు అనే నినాదంతో చంద్రబాబుని ఓడించామనుకుని... రాష్ట్రాన్ని ఓడించారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుతో... పరిశ్రమలన్ని బైబై ఆంధ్రప్రదేశ్ అంటున్నాయని విమర్శించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • farmers problems: వర్షాలకు మొలకెత్తుతున్న వేరుశెనగ..ఆందోళనలో అన్నదాతలు
    ఆరుగాలం కష్టపడి పంట పండిస్తున్న అన్నదాతకి వర్షాలు తీవ్రనష్టాన్ని మిగులుస్తున్నాయి. చిత్తూరు జిల్లా తూర్పు మండలాల్లో వేరుశెనగ పంట వర్షాలకు మొలకలొచ్చింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • జిందాల్‌ స్టీల్‌ప్లాంట్‌కు 860 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
    జిందాల్‌ స్టీల్‌ప్లాంట్‌కు 860 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నెల్లూరు జిల్లా తమ్మినపట్నం - మోమిడి పరిధిలో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు కానుంది. వచ్చే నాలుగేళ్లలో ప్లాంట్ విస్తరణకు 3 వేల ఎకరాలు అవసరమని అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'దేశంలో క్లిష్ట పరిస్థితులకు కారకులెవరో ప్రజలకు తెలుసు'
    దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితులకు కారకులెవరో ప్రజలందరికీ తెలుసునన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ. వ్యాక్సిన్​ కొరత, ధరల పెరుగుదల, వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్తత, రైతుల ఆందోళన వంటి సమస్యలను దేశం ఎదుర్కొంటోందని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • నోరు కుట్టేసి.. కాళ్లు, చేతులు కట్టేసి.. రైల్వే ట్రాక్​పై..
    నోరు కుట్టి.. కాళ్లు, చేతులు కట్టేసి ఓ వ్యక్తిని రైల్వే ట్రాక్​పై పడేసిన అమానవీయ ఘటన ఝార్ఖండ్​లో జరిగింది. ఆస్తి వివాద విషయమై.. బాధితుని రెండో భార్య కొడుకే ఈ ఘోరానికి పాల్పడ్డాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Covid: కరోనా ఉద్ధృతి.. ఏ దేశంలో ఎలా?
    కరోనాతో ప్రపంచం మరోమారు ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అమెరికా సహా ప్రపంచ దేశాల్లో కేసులు, మరణాలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో పలు దేశాలు మళ్లీ లాక్​డౌన్​లోకి జారుకుంటున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • హోం లోన్ అప్లికేషన్ రిజక్ట్ అయ్యిందా?
    సొంతింటి కల నెరవేర్చుకునేందుకు చాలా మంది రుణం వైపు మొగ్గు చూపుతుంటారు. అయితే హోం లోన్ పొందటం అంత తేలికైన విషయమేమీ కాదు. కొన్నిసార్లు బ్యాంక్​లు రుణం మంజూరు చేయకపోవచ్చు. ఇందుకు దరఖాస్తులో చేసే తప్పులు సహా అనేక ఇతర కారణాలు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • నిర్మాతగా​ తాప్సీ.. 'అధికారమ్​' కోసం థమన్​
    చిత్రసీమలో కొత్త సినిమా కబుర్లు వచ్చేశాయి. 'డియర్​ మేఘ' లిరికల్​ వీడియోతో పాటు 'సమ్మతమే' ఫస్ట్​లుక్​, తాప్సీ నిర్మాణసంస్థ, లారెన్స్​ 'అధికారమ్​' సినిమా అప్​డేట్స్​ ఇందులో ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • అల్లు అర్హ ఎంట్రీ ఫిక్స్.. 'శాకుంతలం' చిత్రంతో తెరపైకి
    అల్లు అర్జున్ తనయ అల్లు అర్హ వెండితెరపై మెరిసేందుకు రంగం సిద్ధమైంది. సమంత హీరోయిన్​గా గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'శాకుంతలం' సినిమాలో ప్రిన్స్ భరతగా కనిపించనుందీ చిన్నారి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details