ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు@9PM

.

By

Published : Apr 28, 2021, 9:01 PM IST

ప్రధాన వార్తలు@9PM
ప్రధాన వార్తలు@9PM

1. ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు వెల్లడి

ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. 2018 నోటిఫికేషన్​కు సంబంధించి ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ ప్రకటించింది. కమిషన్ అధికారిక వెబ్​సైట్(www.psc.ap.gov.in)​లో అభ్యర్థుల వివరాలను పేర్కొన్నారు. జూన్ 14 నుంచి ఇంటర్వూలు నిర్వహించే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

2. ముఖ్యమంత్రి జగన్‌కు సీబీఐ కోర్టు నోటీసులు.. మే 7న విచారణ

ముఖ్యమంత్రి జగన్‌కు సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ బెయిల్ రద్దు చేయాలన్న ఎంపీ రఘురామకృష్ణ రాజు పిటిషన్‌పై నోటీసులు ఇచ్చింది. ముఖ్యమంత్రిగా కొనసాగుతూ బెయిల్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని రఘురామ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ మేరకు వివరణ ఇవ్వాలని సీఎం జగన్‌కు, సీబీఐకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కోర్టు నోటీసులు పంపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

3. విజయవాడలో భారీ చోరీ.. 7 కేజీల బంగారం అపహరణ

విజయవాడలో ఓ బంగారు దుకాణం యజమాని ఇంటి వద్ద ఉంచిన బంగారం సుమార 7 కిలోలు చోరీకి గురైంది. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

4. రాష్ట్రంలో కరోనా కల్లోలం.. కొత్తగా 14,669 కేసులు, 71 మరణాలు

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజురోజుకీ వైరసబారిన పడుతోన్న బాధితులతో పాటు మరణాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 74,748 పరీక్షలు నిర్వహించగా.. 14,669 కేసులు నిర్ధారణ కాగా.. 71 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 10,69,544 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

5. 'టీకాల వల్ల కలిగే దుష్ప్రభావాలు స్వల్పమే'

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్న వేళ కొందరిలో టీకాపై భయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కరోనా టీకాల వల్ల కలిగే దుష్ప్రభావాలు స్వల్పమేనని బ్రిటన్‌ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. వ్యాక్సిన్‌ తీసుకున్న నలుగురిలో ఒకరికి మాత్రమే దుష్ప్రభావాలు కనిపిస్తుండగా.. అవి ఒకటి లేదా రెండు రోజుల్లోనే తగ్గిపోతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

6. 'టీకా ధరలను నియంత్రించడంలో మోదీ సర్కార్​ విఫలం'

కరోనా టీకా ధరలను కట్టిడి చేయడంలో మోదీ సర్కారు విఫలమైందని ఆరోపించారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. టీకా అభివృద్ధి చేసేందుకు ప్రజల సొమ్ము చెల్లించిన ప్రభుత్వం.. తిరిగి వాటిని కొనేందుకు ఎందుకు అంత ఎక్కువ మొత్తం చెల్లిస్తోందని అన్నారు. రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలను భాజపా నేత హిమంత బిస్వా తిప్పికొట్టారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

7. సైకిల్‌పై భార్య శవం.. దిక్కుతోచని స్థితిలో భర్త

కరోనాతో మృతి చెందిన భార్య అంత్యక్రియలకు గ్రామస్థులు అనుమతించకపోవటంతో దిక్కు తోచని స్థితిలో ఓ వృద్ధుడు మృతదేహాన్ని సైకిల్​పై తీసుకెళ్తున్న ఫోటోలు వైరల్​గా మారాయి. ఉత్తర్​ప్రదేశ్​ జౌన్​పుర్​ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఒడిశా బొలాన్​గిర్​ జిల్లాలోనూ ఓ కొడుకు తండ్రి మృతదేహాన్ని సైకిల్​పై తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో ఖననం చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

8. కొరియర్ పేరుతో కొత్త మోసం- క్లిక్ చేస్తే బ్యాంక్​ ఖాతా ఖాళీ!

వాట్సాప్‌ను వేదికగా చేసుకుని ఇటీవల స్కామ్‌ మెసేజ్‌లు ఎక్కువగా వస్తున్నాయి. మీకు 'పింక్‌ వాట్సాప్‌' కావాలా? అంటూ ఈ మధ్య ఒక లింక్‌ హల్‌చల్‌ చేసింది. చాలామంది ఈ లింక్‌ క్లిక్‌ చేసి వ్యక్తిగత సమాచారాన్ని పోగొట్టుకున్నారు. ఈ స్పామ్‌ స్కామ్‌ ఇంకా సద్దుమణగక ముందే మరోసారి మాల్వేర్‌.. బయటికొచ్చింది. అయితే ఈసారి మెసేజ్‌ల రూపంలో వస్తున్నాయి. ఈ మాల్‌వేర్‌ పేరు 'ప్లూ బాట్‌'. అసలేంటీ ఫ్లూబాట్‌, ఎలా వస్తుంది, వస్తే ఏం చేయాలో చూద్దాం ! పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

9. టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న సన్​రైజర్స్

దిల్లీ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్​తో జరగనున్న మ్యాచ్​లో టాస్ గెలిచిన సన్​రైజర్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్​లోనైనా గెలిచి విజయాల బాట పట్టాలని భావిస్తోంది వార్నర్​సేన. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

10. 'ఏ1 ఎక్స్​ప్రెస్' ఓటీటీ విడుదల ఎప్పుడంటే?

సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన 'ఏ1 ఎక్స్​ప్రెస్' ఓటీటీ విడుదల తేదీ ప్రకటించారు. మార్చి 5న థియేటర్లకు వచ్చిన ఈ మూవీ పర్వాలేదనిపించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details