- Car Crashed Into Pond: వంకలోకి దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి
నిర్మాణంలో ఉన్న వంతెన.. ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేని పరిస్థితి.. దీంతో అదుపు తప్పి కారు వంకలోకి దూసుకెళ్లిన ఘటన అనంతపురం జిల్లా విడపనకల్ మండలం డోనేకల్లో జరిగింది. హైదరాబాద్ నుంచి బళ్లారి వైపు వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- Increasing crimes against women: స్త్రీలపై పెరిగిన వేధింపులు.. మహిళా సంఘాల ఆందోళన
రాష్ట్రంలో మహిళలపై వేధింపులు గతేడాది కంటే 49 శాతం పెరగడంపై మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మహిళలు రావాలంటేనే ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోతున్నారు. ప్రభుత్వం స్త్రీల రక్షణకు దిశ యాప్ తెచ్చినా.. పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోతున్నారని అభిప్రాయపడుతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- Accident at dandigunta: నెల్లూరు జిల్లాలో టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి
నెల్లూరు జిల్లా విడవలూరు మండలం దండిగుంట సమీపంలో ద్విచక్రవాహనాన్ని టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరొవ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- People Sleeping On Pavements: ఎముకలు కొరికే చలిలో.. ప్లాస్టిక్ సంచులు, ఫ్లెక్సీలే దుప్పట్లు
రాష్ట్రంలో చలి పంజా విసురుతోంది. చలి భయంతో ప్రజలు బయటకు వచ్చేందుకే జంకుతున్నారు. కానీ ఎముకలు కొరికే చలిలో గజగజ వణుకుతూ.. రోడ్లపైనే నిద్రిస్తూ అవస్థలు పడుతున్నారు నిరాశ్రయులు. చలి నుంచి రక్షించుకోవడానికి దుప్పట్లు సైతం లేక ప్లాస్టిక్ సంచులు, ఫ్లెక్సీలు కప్పుకొని ఇబ్బందులు పడుతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'మోదీలో మాత్రమే ఆ ప్రత్యేకత.. ఇతర ప్రధానుల్లో కనిపించదు'- శరద్ పవార్ కితాబు
రిపాలనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గట్టి పట్టుందని, అదే ఆయన బలమని కొనియాడారు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్. ఏదైనా పనిని ప్రారంభించారంటే పూర్తయ్యే వరకు విశ్రమించరని ప్రశంసించారు. ఓ మరాఠి దినపత్రిక నిర్వహించిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు పవార్. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'బూస్టర్ డోసుగా ఆ వ్యాక్సిన్ ఉత్తమం'
ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం ఇటీవల బూస్టర్ డోసుకు ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో కొవిషీల్డ్ తీసుకున్న వారికి బూస్టర్ డోసుగా కొవావాక్సే సరైనది సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'ప్రైవేటీకరణ.. రిజర్వేషన్లను అంతం చేసే మార్గం'
ప్రైవేటీకరణతో దేశంలో రిజర్వేషన్లను అంతం చేయాలని మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు. మహిళా శక్తి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- మెక్సికోలో కాల్పులు- 16నెలల చిన్నారి సహా 8మంది మృతి
మెక్సికోలో జరిగిన కాల్పుల ఘటనలో 16నెలల చిన్నారి సహా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఓ ఇంట్లో ఉండే వ్యక్తులు లక్ష్యంగా కాల్పులు జరిగాయి. గాయపడ్డ మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 17 ఏళ్లకే ప్రపంచ కిరీటం.. క్లార్సన్కు షాక్
ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో మరోసారి ఫేవరేట్‌గా బరిలో దిగిన డిఫెండింగ్ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్‌కు షాకిచ్చాడు 17 ఏళ్ల నోడిర్బెక్ అబ్దుసటోరోవ్. కార్ల్‌సన్‌పై నెగ్గడమే కాకుండా.. చివరి వరకూ దూకుడు కొనసాగించిన ఆ టీనేజర్ ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించాడు. ఉజ్బెకిస్థాన్‌కు చెందిన అతను.. ఈ టైటిల్ గెలిచిన అతి పిన్న వయస్సు ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- టికెట్ రేట్ల వ్యవహారంపై వర్మ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ ఎన్కౌంటర్ ఘటన నేపథ్యంలో వస్తున్న చిత్రం 'ఆశ ఎన్కౌంటర్'. ఈ ఘటనకు ముందు మాములు మనుషులుగా ఉన్న వ్యక్తులు.. ఆ సమయంలో రాక్షసులుగా ఎలా మారారన్న ఆసక్తికర అంశాన్ని సినిమాలో చూపించబోతున్నామని చెప్పారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఏపీలో టికెట్ రేట్ల అంశంపైనా స్పందించారు ఆర్జీవీ. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి