ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు@ 9AM

.

top news 9 am
ప్రధాన వార్తలు @9AM

By

Published : Jul 5, 2020, 9:08 AM IST

  • అసమాన పోరాటం

పోరాటం ఆగలేదు... పోరు తీరు మారింది. దేశ చరిత్రలోనే తొలిసారి వర్చువల్‌గా నిర్వహించిన అతిపెద్ద ఆందోళనగా అమరావతి ఉద్యమం నిలిచింది. రైతుల పోరాటం 200వ రోజు సందర్భంగా నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమానికి రాజకీయ, ప్రజాసంఘాల మద్దతు లభించి విజయవంతమైంది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • కోత పడింది..!

రాష్ట్రంలో ఈ ఏడాది ఇంజినీరింగ్ సీట్లు తగ్గాయి. గతేడాదితో పోలిస్తే 1,179 సీట్లకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) కోత విధించింది. ప్రైవేటు కళాశాలల్లో గతేడాది 1,40,763 సీట్లు ఉండగా.. ఈసారి 1,791 సీట్లు తగ్గాయి. గతేడాది మూడు డీమ్డ్‌ కళాశాలలకు 7,800 సీట్లకు అనుమతి ఇవ్వగా.. ఈసారి 7,210కి పరిమితం చేసింది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • కరోనా కాటేస్తోంది..!

కరోనా కోరలు చాస్తోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా కాటేస్తోంది. అలసత్వం వల్ల కొందరు.. సకాలంలో చికిత్స అందక ఇంకొందరు ప్రాణాలు విడిచారు. అనుమానిత లక్షణాలున్నా పరీక్షలు చేయించుకోకుండా మరికొందరు ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • వారి వల్లే ఉన్నతంగా..!

గురుపౌర్ణమి సందర్భంగా ఫేస్​బుక్​లో తన మనోగతాన్ని తెలియజేశారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. తల్లిదండ్రుల తర్వాత స్థానాన్ని గురువుకే భారతీయులు ఇచ్చారని పేర్కొన్నారు. గురు, శిశ్యుల బంధంతోనే ఉన్నత సమాజం సాకారమవుతుందన్నారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • స్వల్ప ధరలతో పరీక్ష

కరోనా నిర్ధరణ పరీక్షల కోసం చౌకైన సెంట్రిప్యూజ్​ను తయారుచేశారు భారత సంతతి శాస్త్రవేత్త మను ప్రకాశ్. పేద దేశాల్లో వైరస్ పరీక్షలను పెంచేందుకు ఇది వీలు కలిగిస్తుందని చెప్పారు. ఒక్కో పరీక్షకు ఒక డాలర్ మాత్రమే ఖర్చవుతుందని వివరించారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • అమెరికా లవ్స్ ఇండియా

యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​నకు.. అమెరికా 244వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ట్వీట్ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. దీనిపై స్పందించిన ట్రంప్... మోదీకి ధన్యవాదాలు చెప్పారు. భారతదేశాన్ని అమెరికా సర్వదా ప్రేమిస్తుంటుంది అని ఆయన పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • ఆదాయం ఫట్‌

కొవిడ్‌-19 ప్రభావం ప్రజా రవాణాపై అధికంగా పడింది. బస్సులు, రైళ్లు, విమానాలతో పాటు క్యాబ్‌లలో ప్రయాణానికీ పలు ఆంక్షలుండగా, అందుబాటులో ఉన్న వాటిలో వెళ్లేందుకు ప్రజలూ వెనుకాడుతున్నారు. వినోద రంగమైతే పూర్తిగా మూతబడింది. సినిమా థియేటర్ల గేట్లు మూతబడి 100 రోజులు దాటగా, సినీ-మ్యూజికల్‌ తారలు పాల్గొనే వినోద కార్యక్రమాల వంటివీ నిర్వహించే పరిస్థితి లేదు. ఈ రంగాలకు టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చిన సంస్థల ఆదాయం భారీగా క్షీణించింది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • ఆ దేశాల్లో తీవ్రం

ప్రపంచ దేశాలపై మహమ్మారి కరోనా విజృంభణ కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా వైరస్​ కేసుల సంఖ్య 1.14 కోట్లకు చేరువలో ఉంది. ఇప్పటివరకు దాదాపు 5 లక్షల 33 వేలమంది కొవిడ్​ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అమెరికా, బ్రెజిల్​ సహా దక్షిణాఫ్రికా, పాక్​, రష్యా, దక్షిణ కొరియాల్లో కేసులు విస్తృతంగా పెరుగుతున్నాయి. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • యోధుడి నిష్క్రమణ

తన ఆటతీరుతో బ్యాడ్మింటన్​ ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాడిగా పేరు తెచ్చుకున్న చైనా షట్లర్​ లిన్ ​డాన్​.. శనివారం ఆటకు వీడ్కోలు పలికాడు. సోషల్​మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • సూపర్​ 'మచ్చి'

మెగాహీరో కల్యాణ్​ దేవ్ ప్రధానపాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'సూపర్​ మచ్చి'. ఇటీవలే ఈ సినిమా షూటింగ్​ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను ప్రారంభించుకుంది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details