- కరోనా బాధితురాలి పరారీ
అనంతపురం ఆసుపత్రి నుంచి ఓ కరోనా బాధితురాలు బయటకు వెళ్లిపోయింది. ఉరవకొండకు కాలినడకన వెళ్తూ.. మార్గమధ్యలో స్పృహ కోల్పోయింది. విషయాన్ని 108 సిబ్బందికి తెలిపినా ఎవరూ స్పందించలేదు. చివరకు ఎస్పీ ఆదేశాలతో ఎస్సై ఆమెను ప్రైవేటు వాహనంలో ఐసోలేషన్ వార్డుకు తరలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఫిర్యాదుల వెల్లువ
పశ్చిమగోదావరి జిల్లా వైకాపాలో వర్గ విభేదాలు తీవ్రమయ్యాయి. ఎంపీ రఘురామకృష్ణరాజుపై వైకాపా ఎమ్మెల్యేలు వరుసపెట్టి పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. మంత్రి శ్రీరంగనాథరాజు బాటలోనే... మరో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కూడా రఘురామపై భీమవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అవగాహనపై సర్వే
కరోనా అంటే ప్రమాదకరమనే అవగాహన ఉంది. కానీ ఏయే పద్ధతుల్లో ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుందనే విషయం చాలామందికి తెలియదు. గొలుసు కట్టు వ్యాప్తిని ఎలా నిరోధించాలనే అంశాలపైనా ప్రజలకు అవగాహన కల్పిస్తే... సామాజిక వ్యాప్తిని కొంతవరకైనా నివారించగలమని ఓ అధ్యయనం చెబుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఘరానా మొగుడు
కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి.. తన భార్యను హనీమూన్కు తీసుకెళ్లాడు. అనంతరం తన ప్రియురాలిని కూడా అక్కడికే చేర్చాడు. ఇద్దరినీ వేర్వేరు గదుల్లో ఉంచాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అద్దె అడిగాడని హత్య
తమిళనాడు కుండ్రటూరులో ఘోరం జరిగింది. ఇంటి అద్దె అడిగిన యజమానిని ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'అగ్ర' ప్రభుత్వంతో చర్చలు