Covid Cases in Telangana: తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. రోజువారీ కేసులు కొన్నినెలల తర్వాత 2వేల మార్కును దాటాయి. గడిచిన 24 గంటల్లో 64,744 పరీక్షలు నిర్వహించగా... 2,295 పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,89,751కి చేరింది. వైరస్ బారిన పడి ముగ్గురు చనిపోగా.. మొత్తం మృతుల సంఖ్య 4,039కి చేరింది. కరోనా నుంచి 278 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9,861 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.
జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 1452, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలో 232 మందికి వైరస్ నిర్ధారణ అయింది. రంగారెడ్డిలో 218, హనుమకొండ 54, సంగారెడ్డి 50, నిజామాబాద్, ఖమ్మంలో 29 చొప్పున కొత్త కేసులు వచ్చినట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ నిన్నటితో పోల్చితే పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది.