ఏకైక రాజధాని అమరావతి ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని టీఎన్ఎస్ఎఫ్ జాతీయ సమన్వయకర్త రవి నాయుడు డిమాండ్ చేశారు. రాజధాని అమరావతి కోసం టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం తిరుపతిలో జలదీక్ష చేపట్టారు. రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా మార్చాలని ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
మూడు రాజధానులు అంటే విభజనకు నాంది అని.. భవిష్యత్తులో ప్రాంతాలవారీగా ప్రజలను విభజించే ప్రయత్నం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని మండిపడ్డారు. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వెంటనే అమరావతిని రాజధానిగా కొనసాగేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.