ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Three girls Died: సెల్లార్ గుంతలో పడి.. ముగ్గురు బాలికలు మృతి

Three girls Died: హైదరాబాద్‌ కేపీహెచ్‌బీలో విషాదం చోటుచేసుకుంది. కేపీహెచ్‌బీ నాలుగో ఫేజ్‌లో ఓ అపార్ట్​మెంట్​లో ఉన్న సెల్లార్ ​గుంతలో పడి ముగ్గురు బాలికలు మృతిచెందారు.

Three girls Died
Three girls fell into a cellar pit and died in hyderabad

By

Published : Dec 24, 2021, 8:29 PM IST

Updated : Dec 24, 2021, 8:50 PM IST

Three girls Died: హైదరాబాద్‌ కేపీహెచ్‌బీలో విషాదం చోటుచేసుకుంది. కేపీహెచ్‌బీ నాలుగో ఫేజ్‌లో సెల్లార్​ గుంతలో పడి ముగ్గురు బాలికలు మృతి చెందారు. రమ్య(7), పర్వేజ్ ‍(12), సంగీత(14) అనే చిన్నారులు కలిసి ఆడుకుంటుండగా.. ప్రమాదవశాత్తు నీటి సెల్లార్​లో పడిపోయారు. ఊపిరాడక ముగ్గురూ మృతి చెందారు.

సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకున్నారు. చిన్నారుల మృతదేహాలు బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. తొలుత ఇద్దరు బాలికల మృతదేహాలు బయటకు తీసిన పోలీసులు.. కాసేపటి తర్వాత మూడో బాలిక మృతదేహాన్ని కనుగొన్నారు.

తల్లిదండ్రుల ఆందోళన..
అప్పటి వరకు కళ్లముందున్న ముగ్గురు చిన్నారులూ.. ఒక్కసారిగా విగతజీవులుగా మారటాన్ని ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. చిన్నారులు మృతదేహాలు చూసి గుండెలవిసేలా రోదిస్తున్నారు. సెల్లార్ గుంత పూడ్చాలని చెప్పినా పట్టించుకోలేదని ఆగ్రహించిన తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళన చేపట్టారు. ఆసుపత్రికి మృతదేహాలను తరలిస్తుండగా అడ్డుకున్నారు. రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆగ్రహంతో అంబులెన్స్‌ అద్దాలను సైతం ధ్వంసం చేశారు. పరిస్థితి చేయిదాటేలా కనిపించడంతో.. పోలీసులు స్థానికులను చెదరగొట్టి, అంబులెన్స్‌ను పంపించారు.

శవపరీక్షల నిమిత్తం ముగ్గురి మృతదేహాలనూ గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే కృష్ణారావు హామీ ఇచ్చారు. కాగా.. 2015, 2018లోనూ సెల్లార్‌ గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతిచెందారు.

ఇదీ చూడండి :

Man Climbed Cell Tower: భార్య కాపురానికి రావట్లేదని సెల్​ టవర్ ఎక్కిన భర్త

Last Updated : Dec 24, 2021, 8:50 PM IST

ABOUT THE AUTHOR

...view details