ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కింగ్ కోఠి ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందక ముగ్గురు మృతి - అమరావతి వార్తలు

హైదరాబాద్‌ కింగ్‌కోఠి ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత ముగ్గురు కరోనా రోగుల ప్రాణాలు బలిగొంది. ట్యాంకు రావడం ఆలస్యం కావడంతో కొద్దిసేపు రోగులు ఆక్సిజన్​ అందక ఇబ్బందిపడినట్లు తెలుస్తోంది. దీనిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్​ చేస్తున్నారు.

కింగ్ కోఠి ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందక ముగ్గురు మృతి
కింగ్ కోఠి ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందక ముగ్గురు మృతి

By

Published : May 9, 2021, 8:26 PM IST

కింగ్ కోఠి ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందక ముగ్గురు మృతి

హైదరాబాద్‌ కింగ్‌కోఠి ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక ముగ్గురు కరోనా బాధితులు మృతి చెందారు. ఆక్సిజన్ అందక 20 మంది సుమారు గంటసేపు ఇబ్బంది ఎదుర్కొన్నారని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆసుపత్రిలోని ఆక్సిజన్ ఫిల్లింగ్ ట్యాంక్‌లో ఆక్సిజన్ అయిపోవడంతో.. మరో ట్యాంక్ రావటానికి ఆలస్యం కావడం వల్ల సమస్య తలెత్తింది.

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నుంచి వచ్చే ఆక్సిజన్ ఫిల్లింగ్ ట్యాంక్ డ్రైవర్‌కి చిరునామా తెలియకపోవడం వల్ల తొలుత ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లాడు. విషయం తెలుసుకున్న నారాయణగూడ పోలీసులు ట్యాంకర్‌ను కింగ్ కోఠి ఆసుపత్రికి తరలించారు.

ఆక్సిజన్ అందకే 20 మందిలో ముగ్గురు చనిపోయారని మృతుల బంధువులు వాపోయారు. ప్రాణ వాయువు నిలిచిపోయే వరకు వేచిచూసి నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని.. వారు డిమాండ్‌ చేశారు. ట్యాంకర్‌ రావడంతో ప్రాణవాయువు సరఫరాను అధికారులు పునరుద్ఘరించారు.

ABOUT THE AUTHOR

...view details