annually interest burden: రాష్ట్రంలో అప్పుల భారమే కాదు... ఏటా తీర్చాల్సిన అసలు, వడ్డీల భారమూ కూడా పెరిగిపోతుంది. రాష్ట్రం వివిధ రూపాల్లో తీసుకున్న మొత్తం రుణాల్లో సెక్యూరిటీల ద్వారా 2021 మార్చి నెలాఖరు వరకూ రూ.2,59,668.30 కోట్ల అప్పు చేసింది. ఈ మొత్తం చెల్లింపు ఎలాగన్న లెక్కలను రిజర్వుబ్యాంకు తాజా నివేదికలో పొందుపరిచింది. దాని ప్రకారం వచ్చే ఆరేళ్లలో రూ.లక్ష కోట్లకు పైగా తీర్చాల్సి ఉంటుంది. వడ్డీల భారం కలిపితే ఇది ఇంకా అదనమే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తీరుస్తున్న అప్పుతో పోలిస్తే వచ్చే ఏడాది నుంచి భారం రెట్టింపు కాబోతోంది. 2022 మార్చి వరకూ (ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేవరకూ) తీసుకునే మొత్తం రుణం రూ.3,98,903.60 కోట్లుగా అంచనా. ఇంద]ులో 2021 మార్చి వరకు తీసుకున్న రూ.2,59,668.30 కోట్లనే రిజర్వుబ్యాంకు పరిగణనలోకి తీసుకుని లెక్కించింది. ప్రభుత్వ సెక్యూరిటీల ద్వారా పొందిన రుణాల చెల్లింపులో అన్ని రాష్ట్రాల పరిస్థితీ ఇలాగే ఉందని ఆ నివేదిక ప్రస్తావించింది.
loans burden: వచ్చే ఏడు నుంచి రుణాల భారం రెట్టింపు
annually interest burden: రిజర్వు బ్యాంకు నుంచి రాష్ట్రం తీసుకున్న అప్పులతో పాటు ఏటా తీర్చాల్సిన అసలు, వడ్డీల భారం కూడా పెరిగిపోతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తీరుస్తున్న అప్పుతో పోలిస్తే వచ్చే ఏడాది నుంచి భారం రెట్టింపు కాబోతోంది.
ఆయా రాష్ట్రాలపై ఎప్పుడు ఎంత చెల్లింపుల భారం పడుతోందో పేర్కొంది. ఆ నివేదికలో ఈ వివరాలు పొందుపరిచింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై దాదాపు రూ.6.82 లక్షల కోట్ల ఆర్థికభారం ఉన్నట్లు అంచనా. ఇందులో ప్రభుత్వంపై నేరుగా రుణభారం రూ.3.98 లక్షల కోట్లని రిజర్వుబ్యాంకు లెక్కలే చెబుతున్నాయి. ఇవి కాక ప్రభుత్వం కార్పొరేషన్లకు సుమారు రూ.1.25 లక్షల కోట్ల వరకు గ్యారంటీలు ఇచ్చినట్లు అనధికారిక లెక్కలు పేర్కొంటున్నాయి. వాటి రుణాలను ప్రభుత్వమే తీర్చాలని కాగ్ సైతం ప్రస్తావించింది. ఇవికాక గుత్తేదారులు, సరఫరాదారులకు ప్రభుత్వం పడ్డ బకాయిలు, ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు, కరవుభత్యం బకాయిలు అన్నీ కలిపితే అంత భారం తేలుతోంది. ఈ చెల్లింపుల భారమూ లెక్కిస్తే రాబోయే ఆర్థిక సంవత్సరాల్లో రూ.వేల కోట్లు చెల్లింపుల రూపంలోనే ప్రభుత్వ బడ్జెట్ భారం వహించాల్సి ఉంటుంది.
ఇదీ చూడండి:weather forecast: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఉత్తర కోస్తాంధ్రకు వర్ష సూచన