'యాసంగి పంటకు కొనుగోలు కేంద్రాలు ఉండవు KCR On Yasangi: తెలంగాణలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. బాయిల్డ్ రైస్ కొనేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పిందన్న కేసీఆర్.. ఎంత పోరాడినా ఒప్పుకోవట్లేదని తెలిపారు. ధాన్యం పండించి రైతులు నష్టపోవద్దనే ధైర్యంగా ప్రకటన చేస్తున్నామన్నఆయన..యాసంగి పంటకు కొనుగోలు కేంద్రాలు ఉండవని స్పష్టం చేశారు.
'మోదీని అడగండి..'
వానాకాలం పంటనే కేంద్రం పూర్తిగా తీసుకోవట్లేదని.. కేవలం 40 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణకే అంగీకరించిందని తెలిపారు. రాష్ట్ర రైతులను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మోసం చేస్తున్నారని.. ధాన్యం కొనుగోళ్లపై తెలియకపోతే మోదీని అడిగి తెలుసుకోవాలని సూచించారు.
ఇక రైతుల ఇష్టం..
యాసంగిలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండబోవని స్పష్టం చేసిన కేసీఆర్.. సొంతంగా అమ్ముకునే రైతులు యాసంగిలో వరి వేసుకోవచ్చన్నారు. కేంద్రం తీసుకునే పరిస్థితి లేనందున వరి వేయొద్దని చెప్పారు. మొత్తం ధాన్యం సేకరణ, నిల్వ శక్తి రాష్ట్రానికి లేదన్నారు. యాసంగి రైతుబంధు యథాతథంగా ఇస్తామని చెప్పారు.
రైతు ఉద్యమంలో చనిపోయిన రైతులకు రూ.3 లక్షలు ఇస్తామన్న కేసీఆర్.. రూ.27.50 కోట్ల ఆర్థిక సాయాన్ని మంత్రివర్గం ఆమోదించిందని వెల్లడించారు. తాను, మంత్రులు వెళ్లి రైతు కుటుంబాలకు అందజేస్తామన్నారు.
ఇదీచూడండి:CM KCR PC: 'దమ్ముంటే బాయిల్డ్ రైస్ కొనిపించు.. కిషన్‌రెడ్డి'