ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Theft in petrol bunk: పెట్రోల్ బంకులో దొంగల బీభత్సం.. రూ.40వేలు చోరీ - Nizamabad district news

Theft in petrol bunk: తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో దొంగల ముఠా హల్​చల్​ చేసింది. ధర్పల్లి మండల కేంద్రంలోని ఓ పెట్రోల్ బంకులో బీభత్సం సృష్టించింది. రాళ్లదాడితో బంకు సిబ్బందిని బెదిరించిన దుండగులు... క్యాష్ కౌంటర్ ఎత్తుకెళ్లారు

Theft in petrol bunk
Theft in petrol bunk

By

Published : Dec 30, 2021, 6:19 PM IST

Theft in petrol bunk: తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో దొంగలు హల్​చల్​ చేశారు. ధర్పల్లి మండల కేంద్రంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో బీభత్సం సృష్టించారు. పది మందికి పైగా... ముఠాగా వచ్చి పెట్రోల్ బంకుపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. భయాందోళనకు గురైన సిబ్బందిని బెదిరించి.. క్యాష్ కౌంటర్​ను పగలగొట్టారు. అందు​లో ఉన్న రూ.40 వేలను దొంగలించారు.

బంకు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐ శ్రీశైలంతో కలిసి నిజామాబాద్ సీపీ నాగరాజు ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇదీ చదవండి:MINISTER PERNI NANI: నిబంధనలు పాటిస్తూ థియేటర్లు నడుపుకోవచ్చు: పేర్ని నాని

ABOUT THE AUTHOR

...view details