ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TS New zonal system: ఉద్యోగుల కేటాయింపునకు షెడ్యూల్ విడుదల - ఉద్యోగుల కేటాయింపునకు షెడ్యూల్

కొత్త జోనల్ విధానం మేరకు ఉద్యోగుల కేటాయింపునకు తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటన చేసింది. జిల్లా, జోనల్‌, మల్టీ జోనల్‌ కేడర్‌ ఉద్యోగుల నుంచి 16 వరకు ఐచ్ఛికాల స్వీకరిస్తామని తెలిపింది. ఈ నెల 20 లోపు కేటాయింపు ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు వెల్లడించింది.

TS New zonal system
TS New zonal system

By

Published : Dec 14, 2021, 8:56 AM IST

కొత్త జోనల్ విధానంలో జిల్లా, జోనల్, మల్టీ జోనల్ కేడర్ ఉద్యోగుల నుంచి 16 వరకు ఐచ్ఛికాల స్వీకరణ చేపడతామని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు ఉద్యోగుల కేటాయింపునకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 20 లోపు కేటాయింపు ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది. కేటాయింపు ఉత్తర్వుల తర్వాత విధుల్లో చేరేందుకు వారం గడువు ఇవ్వనున్నట్లు ప్రకటన విడుదల చేసింది.

తెలంగాణలో కొత్త జోనల్‌ విధానంలో భాగంగా సొంత జిల్లాలు, జోన్లు, బహుళ జోన్లకు వెళ్లేందుకు ఉద్యోగులు, అధికారులకు అవకాశం కల్పించగా.. వీటికోసం 60 వేల మంది ఐచ్ఛికాలు (ఆప్షన్లు) సమర్పిస్తారని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details