ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

high court: పిటిషనర్ సంస్థపై తొందరపాటు చర్యలొద్దు : హైకోర్టు

వార్షిక డెడ్​రెంట్ విలువకు పది రెట్లు ప్రీమియం మొత్తంగా చెల్లించాలని పేర్కొంటూ గనుల శాఖ ఇచ్చిన జీవో 65 ఆధారంగా పిటిషనర్ సంస్థపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని అధికారులను హైకోర్టు ఆదేశించింది. కౌంటర్ వేయాలని పేర్కొంటూ విచారణను ఈనెల 23 వాయిదా వేసింది.

high court
high court

By

Published : Sep 20, 2021, 2:27 AM IST

వార్షిక డెడ్​రెంట్ విలువకు పది రెట్లు ప్రీమియం మొత్తంగా చెల్లించాలని పేర్కొంటూ గనుల శాఖ ఈ ఏడాది ఆగస్టు 4 ఇచ్చిన జీవో 65 ఆధారంగా పిటిషనర్ సంస్థపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని అధికారులను హైకోర్టు ఆదేశించింది. కౌంటర్ వేయాలని పేర్కొంటూ విచారణను ఈనెల 23 వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు ఇటీవల ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు.

చిన్న తరహా ఖనిజాల లీజుకోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లు .. విస్తీర్ణానికి వార్షిక డెడ్​రెంట్ విలువకు పది రెట్లు ప్రీమియం మొత్తంగా చెల్లించాలని పేర్కొంటూ గనుల శాఖ ఇచ్చిన జీవో 65ను సవాల్ చేస్తూ వన్​మైన్​ సంస్థ హైకోర్టులో వ్యాజ్యం వేసింది.

ఇదీ చదవండి

AP High Court: మధ్యంతర బెయిల్‌ కోసం.. హైకోర్టును ఆశ్రయించిన సాంబశివరావు

ABOUT THE AUTHOR

...view details