ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'మీసేవా' కార్యకలాపాల్లో.. ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దు: హైకోర్టు

మీసేవా సెంటర్ల సేవల నిలిపివేతపై నిర్వాహకులు హైకోర్టును అశ్రయించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు.. మీసేవా సెంటర్ల కార్యకలాపాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మీ సేవా కేంద్రాలు అందించే సేవలను పునరుద్ధరించాలని ఆదేశాలు జారీ చేసింది.

హైకోర్టు
హైకోర్టు

By

Published : May 6, 2022, 10:22 PM IST

రాష్ట్రంలో మీసేవా సేవల నిలిపివేతపై దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ మేరకు మీసేవా సెంటర్ల కార్యకలాపాల్లో జోక్యం వద్దని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. మీ సేవా కేంద్రాలు అందించే సర్వీసులు నిలిపివేయవద్దని ఉత్తర్వులు జారీ చేసింది.

మీ సేవా కేంద్రాల తరఫున న్యాయవాది బేతి వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ప్రభుత్వ చర్యల వల్ల ప్రజలకు అసౌకర్యం కలుగుతుందన్నారు. మీసేవా కేంద్రాలకు వచ్చే వారిని గ్రామ సచివాలయాలకు వెళ్లమనడం నిబంధనలకు విరుద్ధమని న్యాయవాది వాదించారు. ఈ చర్య.. మీసేవా నిర్వాహకులతో చేసుకున్న ఒప్పందాలకు వ్యతిరేకమన్నారు. న్యాయవాది వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం.. మీసేవా కేంద్రాల కార్యకలాపాల్లో ప్రభుత్వ జోక్యం వద్దని,సేవలు పునరుద్ధరించాలని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.


ఇదీ చదవండి:వాలంటీర్‌ తప్పు చేస్తే ఎవరు శిక్షిస్తారు.. సర్వీసు నిబంధనలేంటి? : హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details