తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మ్యాక్స్ సొసైటీ వెనుక రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది ఎవరూ చూడకపోవడం వల్ల అటుగా వచ్చిన కుక్క తలను నోట కరిచి పరుగు పెట్టింది. ఆలస్యంగా చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహం తల కోసం రైల్వే పోలీసులు, మరోపక్క రామచంద్రపురం పోలీసులు గాలింపు చేపట్టారు.
తెలంగాణ: మనిషి తలను కుక్క ఎత్తుకెళ్లింది - dog bite human head at ramachandrapuram
రైల్వే ట్రాక్‌పై ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తల, మొండెం వేరు కావడం వల్ల తలను కుక్క ఎత్తుకెళ్లింది. ఈ ఘటన తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో జరిగింది.
మనిషి తలను ఎత్తుకెళ్లిన కుక్క