రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలోని ‘వైరల్ లోడు టెస్టింగ్ ల్యాబ్’లను కొవిడ్ వైరస్ నిర్ధరణ పరీక్షలకు ఉపయోగించనున్నారు. హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తులు ఉపయోగించే మందులు ఎలా పనిచేస్తున్నాయో పరిశీలించి తదుపరి చికిత్స అందించేందుకు వారి నుంచి సేకరించిన నమూనాలను ఈ ల్యాబ్‌ల్లో పరీక్షిస్తున్నారు. కర్నూలు, తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల్లో మినహా మిగిలినచోట్ల ఈ ల్యాబ్‌లు ఉన్నాయి. అయితే..వీటిల్లో ప్రస్తుతం ఐదు మాత్రమే వినియోగంలో ఉన్నాయి. వీటిని కరోనా వైరస్ ప్రాథమిక నిర్ధరణ పరీక్షలకు ఉపయోగించుకోవడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ పరీక్షలు చేసేందుకు అవసరమైన విడి పరికరాలు, రసాయనాల కొనుగోలుకు రూ.2 లక్షల వంతున వైద్య ఆరోగ్య శాఖ కేటాయించింది. తొలివిడత కింద విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాల, విశాఖ కేజీహెచ్‌లో ఉన్న వైరల్ లోడు టెస్టింగ్ ల్యాబ్‌ల్లోని పీసీఆర్ మిషన్ల ద్వారా పరీక్షలను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.
ఎయిడ్స్ వైరల్ లోడ్ టెస్టింగ్ ల్యాబ్‌ల్లోనూ 'కొవిడ్ పరీక్షలు' - కరోనా పరీక్షలు
ఎయిడ్స్ వైరల్ లోడ్ టెస్టింగ్ ల్యాబ్‌లను కొవిడ్ పరీక్షల కోసం ఉపయోగించుకోవడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ ల్యాబ్‌ల్లో కరోనా వైరస్ ప్రాథమిక నిర్ధరణ పరీక్షలు మాత్రమే చేస్తారు.
కొవిడ్ పరీక్షలు