ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) నిర్వహణపై ఈ వారంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డీఎస్సీ నిర్వహించాలని భావిస్తున్నందున టెట్ షెడ్యూల్ను అధికారులు రూపొందిస్తున్నారు. ఈ నెలలో నోటిఫికేషన్ జారీ చేసి, దరఖాస్తుల స్వీకరణ చేపట్టే అవకాశం ఉంది. జనవరి చివర్లో పరీక్ష నిర్వహించనున్నారు. డీఎస్సీ-2018 పోస్టుల భర్తీ (కోర్టు కేసులు లేనివి) ఈనెల చివరి నాటికి పూర్తి చేయనున్నారు.
ఉపాధ్యాయ బదిలీలు నిర్వహించాలి: ఫ్యాప్టో