ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Temperatures rising in AP: రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. కారణమేంటో తెలుసా? - Temperatures news in ap

రాగల 48 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతల్లో సాధారణం కంటే 3 డిగ్రీల మేర పెరుగుదల నమోదు కానున్నట్టు వాతావరణశాఖ స్పష్టం చేసింది. ఈ ఉష్ణోగ్రతల తీవ్రత ఈ నెల 8వ తేదీ వరకూ కొనసాగే అవకాశమున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

Temperatures Rising in AP
Temperatures Rising in AP

By

Published : Jun 2, 2021, 1:56 PM IST

నైరుతీ రుతుపవనాల రాక కాస్త ఆలస్యమవుతున్నందున... రాష్ట్రంలో ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతోంది. వచ్చే 48 గంటల్లో సాధారణం కంటే 3 డిగ్రీల అధికంగా నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో 34 నుంచి 42 డిగ్రీల మధ్య ఉంటుందని తెలిపింది. కోస్తాంధ్రలో చాలాచోట్ల 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది.

ఇవాళ ఉదయం 10 గంటలకే ప్రకాశం జిల్లా కంభంలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డవగా... కృష్ణా జిల్లా కంకిపాడులో 40 డిగ్రీల ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం వివరించింది.

ABOUT THE AUTHOR

...view details