ఇవాళ్టి నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్న వేళ.... రాజధాని అంశంపై గళం విప్పేందుకు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం సిద్ధమైంది. పార్టీ శాసనసభాపక్షం సమావేశంలో... చట్టసభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చంద్రబాబు ఆధ్వర్యంలో నేతలు చర్చించారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధానికి కట్టుబడి ఉన్నామనే విషయాన్ని.... స్పష్టం చేయాలని సంకల్పించారు.
వ్యూహ-ప్రతివ్యూహాలు..
రాజధాని మార్పు బిల్లును ఏ రూపంలోనైనా ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకుని... మండలికి పంపాలన్నది ప్రభుత్వ ఉద్దేశమై ఉంటుందన్న భావనకు తెలుగుదేశం వచ్చింది. అక్కడ వీగిపోతే 22న వైకాపా సభ్యులు ఎక్కువగా ఉన్న సెలెక్ట్ కమిటీ ద్వారా ఆమోదముద్ర వేయించుకోవచ్చనే మార్గమూ ఉందని అనుమానిస్తున్నారు. ఆ ప్రయత్నాలను ఛేదించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించిన నేతలు... ప్రజాగ్రహం ముందు ఏ బిల్లూ నిలవదని వ్యాఖ్యానించారు.