అమెరికా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయులు మృతి
ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లిన ఇద్దురు విద్యార్థులను మృత్యువు కబళించింది. రోడ్డు ప్రమాద రూపంలో వారిని.. కన్నవారికి దూరం చేసింది. మృతుల్లో తెలుగు విద్యార్థి వైభవ్ గోపిశెట్టి ఉన్నారు. వీరు టేనస్సీ స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
Breaking News
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయులు మరణించారు. ఇందులో ఒక తెలుగు విద్యార్థి ఉన్నారు. టేనస్సీ స్టేట్ యూనివర్సిటీలో ఈ ఇద్దరు విద్యార్థులు చదువుతున్నట్లు అధికారులు వెల్లడించారు. మృతి చెందిన వారిని వైభవ్ గోపిశెట్టి, జూడీ స్టాన్లీగా గుర్తించారు. నవంబర్ 28 రాత్రి జరిగిన ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
TAGGED:
road accident in america