Telangana weather updates : తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు తగ్గిపోయాయి. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకూ కొద్ది ప్రాంతాల్లో స్వల్పంగా జల్లులు తప్ప వర్షాలు పడలేదు. బుధవారం నుంచి 5 రోజుల పాటు అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. పశ్చిమ భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు తెలంగాణలోకి వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఒక మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. ఉష్ణోగ్రత సాధారణంకన్నా 2 నుంచి 6 డిగ్రీల వరకూ తక్కువగా ఉంది. నల్గొండ, ఖమ్మం మినహా మిగిలిన ప్రాంతాల్లో గాలిలో తేమ సాధారణంకన్నా ఎక్కువగా ఉంది.
Telangana weather rains : రెండ్రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. నిజామాబాద్ జిల్లాలో కురిసిన వర్షానికి డిచ్పల్లి, ధర్పల్లి, సిరికొండ, ఇందల్వాయి, జక్రాన్ పల్లి ,మోపాల్ మండలంలో చెరువులు, కుంటలు మళ్లీ అలుగు పోశాయి. గడుకోల్‌లోని కప్పుల వాగు లోలెవల్ పైవంతెన నుంచి ప్రవహించింది. బోధన్‌లోని వేంకటేశ్వర కాలనీ, సరస్వతినగర్‌లో రహదారులపై భారీగా నీరు చేరింది.