ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

WEATHER REPORT: తెలంగాణలో నేడు మోస్తరు వర్షాలు.. రేపు, ఎల్లుండి భారీ వానలు!

తెలంగాణలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఒకటి, రెండుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

telangana weather report disclosed that is chances of heavy rains in state
తెలంగాణలో నేడు మోస్తరు వర్షాలు.. రేపు, ఎల్లుండి భారీ వానలు!

By

Published : Jun 29, 2021, 6:54 PM IST

నైరుతి, తూర్పు తెలంగాణ జిల్లాల్లో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఒకటి, రెండుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడుతుందని తెలిపింది.

ఈరోజు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ.. తెలంగాణలోకి కింది స్థాయి గాలులు నైరుతి దిశ నుంచి వీస్తున్నాయని తెలిపింది. నిన్నటి వరకు తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆవర్తనం, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుంచి సౌరాష్ట్ర వరకు ఉన్న ద్రోణి ఈరోజు బలహీనపడ్డాయని పేర్కొంది.

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. నేడూ పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. నిన్న పలుచోట్ల మోస్తరు వానలుపడ్డాయి. వర్షాకాల సీజన్​ ప్రారంభంలోనే భారీ వర్షాలు కురుస్తుండటంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సోమవారం ఉదయం వరకు నమోదైన వర్షపాతం వివరాలు..

అత్యధికంగా సిద్దిపేట జిల్లా హబ్షీపూర్‌- 16.3 సెం.మీ.

మల్కాజ్‌గిరి మెట్టుగూడ- 13.7 సెం.మీ.

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మం. పూడూరు- 12.8 సెం.మీ.

సిద్దిపేట జిల్లా తొగుట మం. తుక్కాపూర్‌- 11.7 సెం.మీ.

నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి- 11.4 సెం.మీ.

ఆదిలాబాద్ జిల్లా బోథ్ మం. పొచ్చెర- 11 సెం.మీ.

జగిత్యాల జిల్లా మేడిపల్లి- 11 సెం.మీ.సిద్దిపేట- 10.9 సెం.మీ.

చేర్యాల- 10.6 సెం.మీ.

ఖమ్మం జిల్లా మధిర మం. సిరిపురం- 10.5 సెం.మీ.

జగిత్యాల జిల్లా మేడిపల్లి మం. గోవిందారం- 10 సెం.మీ.

ఇదీ చదవండి:

AP Cabinet: రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

ABOUT THE AUTHOR

...view details