ఓ ఛానెల్ కార్యక్రమంలో తమపై సినీ హీరో నాగశౌర్య అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ తెలంగాణ రాష్ట్ర టాక్సీ డ్రైవర్ల ఐకాస ఆరోపించింది. ఈ విషయమై ఆ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేసినట్లు ఐకాస నాయకుడు ప్రభాకర్ రెడ్డి తెలిపారు.
హీరో నాగశౌర్యపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు... ఎందుకంటే? - telangana taxi drivers union compliant on hero nagasourya at hrc
డ్రైవర్ల మనోభావాలు దెబ్బతీసే విధంగా సినీ హీరో నాగ శౌర్య వ్యాఖ్యలు చేశారంటూ... తెలంగాణలోని మానవ హక్కుల కమిషన్లో తెలంగాణ రాష్ట్ర టాక్సీ డ్రైవర్స్ ఐకాస ఫిర్యాదు చేసింది. నాగశౌర్య బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
telangana-taxi-drivers-union-compliant-on-hero-naga-sourya-in-human-rights-commission
నాగశౌర్య వ్యాఖ్యలు తమ మనోభావాలు దెబ్బతీసేవిధంగా ఉన్నాయని... దీనిపై బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోని డ్రైవర్లు ఆయన సినిమాలను బహిష్కరిస్తామని పేర్కొన్నారు.