తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేత ప్రక్రియ పూర్తైంది. గతంలోనే మిగతా బ్లాకులు, నిర్మాణాల ప్రక్రియ పూర్తి కాగా జే, ఎల్ బ్లాకుల కూల్చివేత కూడా పూర్తైంది. ప్రస్తుతం సచివాలయ ప్రాంగణంలోని అన్ని భవనాలు నేలమట్టం అయ్యాయి. గత నెల ఏడో తేదీన కూల్చివేత ప్రారంభం కాగా... తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో మధ్యలో వారం రోజుల పాటు ఆగిపోయింది. 25, 26 రోజుల్లోనే కూల్చివేత ప్రక్రియ పూర్తైనట్లు అధికారులు చెబుతున్నారు.
తరలింపు కూడా..
శిథిలాల తొలగింపు కూడా గతంలోనే ప్రారంభం కాగా... ఆ ప్రక్రియ కూడా చివరి దశకు చేరుకుంది. ఈ ప్రక్రియ సైతం వారం, పది రోజుల్లో పూర్తవుతుందని అంటున్నారు. ఆ తర్వాత కొత్త సచివాలయ భవన నిర్మాణం కోసం మొత్తం నేలను చదును చేయనున్నారు. అటు టెండర్ల ప్రక్రియకూ తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. భవనాల నమూనాలు ఇప్పటికే ఖరారు కాగా అంచనాల తయారీ, సంబంధిత ప్రక్రియ కొనసాగుతోంది. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేసి ఈ నెలలోనే టెండర్ల ప్రక్రియను ప్రారంభించేందుకు ఆ రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ కసరత్తు చేస్తోంది.
ఇదీ చూడండి:
'శిరోముండనం బాధితుడు నక్సలిజం వైపు వెళ్లే పరిస్థితి తెచ్చారు'