Nizamabad Rains Today : ఓవైపు పొగమంచు.. మరోవైపు గజగజ వణికిస్తోన్న చలితో తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. ఇవాళ వరణుడు పలకరించాడు. ఆగ్నేయ భారత ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తుండడం, వాయువ్య భారత ప్రాంత వాతావరణంలో నెలకొన్న అస్థిరత ప్రభావంతో పలుచోట్లు వర్షాలు కురిశాయి. నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లి, ఆర్మూర్, ఇందల్వాయి, ధర్పల్లి, సిరికొండ మండలాల్లో వర్షం పడింది.
Telangana Rains Today : తెలంగాణ ప్రజలను పలకరించిన వరణుడు - తెలంగాణ వర్షాలు
Telangana Rains Today : ఓ వైపు పొగమంచు.. మరోవైపు గజగజ వణికిస్తోన్న చలితో తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. ఇవాళ వరణుడు పలకరించాడు. ఆగ్నేయ భారత ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తుండడం, వాయువ్య భారత ప్రాంత వాతావరణంలో నెలకొన్న అస్థిరత ప్రభావంతో నేడు వానలు పడుతున్నాయి. రేపు కూడా రాష్ట్రంలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది.
ఆదివారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ 11 ప్రాంతాల్లో స్వల్పంగా వర్షాలు కురిశాయి. కాగా.. సోమ, మంగళవారాల్లోనూ రాష్ట్రంలో అక్కడక్కడా ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది.
Telangana Weather Updates : అత్యధికంగా బరంపూర్ (ఆదిలాబాద్ జిల్లా)లో 2.2, దస్తురాబాద్(నిర్మల్)లో 1.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దీంతో.. ఉష్ణోగ్రత సాధారణం కన్నా 3 డిగ్రీల వరకూ పెరగడంతో చలి తీవ్రత కొంత తగ్గింది. ఆదివారం తెల్లవారుజామున అత్యల్పంగా తాళ్లపల్లి(రంగారెడ్డి జిల్లా)లో 15.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గాలిలో తేమ సాధారణం కన్నా ఎక్కువగా ఉంటోంది. ఉదయం పూట దట్టంగా పొగమంచు కురుస్తోంది.