తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం తిర్మలాపూర్లో రైతు ఇసుక లారీ కింద పడి రైతు మృతి చెందిన ఘటన గ్రామంలో ఉద్రిక్తతకు దారితీసింది. తమ పొలాల గుండా ఇసుక లారీలు నడపొద్దంటూ... అడ్డుకున్నందుకే ఇసుక మాఫియా లారీతో గుద్ది చంపారని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు.
ఇసుక లారీ కిందపడి వ్యక్తి మృతి- హత్యేనంటూ బంధువుల ఆందోళన
తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం తిర్మలాపూర్లో రైతు ఇసుక లారీ కింద పడి రైతు మృతి చెందిన ఘటన గ్రామంలో ఉద్రిక్తతకు దారితీసింది. ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకే హత్య చేసారంటూ బంధువులు ఆరోపిస్తున్నారు.
గ్రామానికి చెందిన నర్సింహులు బుధవారం రాత్రి తన పొలం మీదుగా.. దుందుబీ వాగుకు వెళ్తున్న ఇసుక లారీని అడ్డుకున్నాడు. అయినప్పటికీ లారీ ముందుకు దూసుకుపోగా.. లారీ కింద పడి ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నర్సింహులు మృతితో ఆగ్రహించిన స్థానిక రైతులు, గ్రామస్థులు లారీతో పాటు, అక్కడున్న ప్రొక్లైనర్, ద్విచక్రవాహనం సహా సామాగ్రిని ధ్వంసం చేశారు. నర్సింహులు మృతదేహంతో ఘటనా స్థలం వద్ద ఆందోళనకు దిగారు.
ఇదీ చూడండి:'ఆ విధానం మాతృభాషలను.. మృత భాషలుగా కాకుండా కాపాడుతుంది'