ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఈనాడు కథనానికి స్పందన... సుమోటోగా స్వీకరించిన తెలంగాణ హైకోర్టు - మూసీ నదిపై ఈనాడు కథనానికి స్పందన

మూసీ కాలుష్యంపై "ఈనాడు" కథనానికి హైకోర్టు స్పందించింది. ఈనెల 18న ఈనాడులో ప్రచురితమైన "మూసీ.. బతుకు మసి" కథనాన్ని సుమోటోగా స్వీకరించింది.

ఈనాడు కథనానికి స్పందన
ఈనాడు కథనానికి స్పందన

By

Published : Nov 26, 2019, 12:29 PM IST

తెలంగాణలోని మూసీనది కాలుష్యంపై ఈనాడుదినపత్రిక కథనానికి తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్పందించింది. మూసీనది కాలుష్యం సుమారు 66 గ్రామాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఈ నెల 18న ఈనాడు కథనం ప్రచురితమైంది. మూసీ.. బతుకు మసి పేరిట ప్రచురితమైన ఈ కథనాన్ని హైకోర్టు సుమోటోగా స్వీకరించింది.

ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించిన ఉన్నతన్యాయస్థానం... రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, పర్యావరణ, పురపాలక, పరిశ్రమల శాఖల ముఖ్య కార్యదర్శులు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, జలమండలి, కాలుష్యనియంత్రణ మండలి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్లను ప్రతివాదులుగా చేర్చింది.

ABOUT THE AUTHOR

...view details