వాన్పిక్ ప్రాజెక్టుకు సంబంధించి మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాల్లో తనకెలాంటి ప్రమేయమూ లేదని మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేవీ బ్రహ్మానందరెడ్డి హైకోర్టుకు నివేదించారు. కేబినెట్ నిర్ణయాలను అమలు చేయడం వరకే తన బాధ్యత అని వివరించారు.
జగన్ అక్రమాస్తుల కేసు(jagan disproportionate assets case) నుంచి తనను తొలగించాలని కోరుతూ ఐఆర్ఏఎస్ విశ్రాంత అధికారి కేవీ బ్రహ్మానందరెడ్డి(vanpic case on bureaucrat K V Brahmananda Reddy) దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ విచారణ చేపట్టారు. వాన్ పిక్ ప్రాజెక్టుకు సంబంధించిన ఫైళ్లను కార్యదర్శి మన్మోహన్ సింగ్ కు పంపించానని.. కేబినెట్ ముందుంచడం ఆయన బాధ్యతేనని బ్రహ్మానందరెడ్డి తెలిపారు.