తెలంగాణలో సినిమా, టీవీ షూటింగులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కొవిడ్-19 మార్గదర్శకాలు, లాక్‌డౌన్ నిబంధనలు పాటించాలని పేర్కొంది. దీనికి సంబంధించిన దస్త్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. పరిమిత సిబ్బందితో, ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ సినిమా, టీవీ కార్యక్రమాల షూటింగులు నిర్వహించుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది.
షూటింగులు పూర్తయిన వాటి పోస్టు ప్రొడక్షన్ పనులు కూడా వెంటనే నిర్వహించుకోవచ్చని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాల్సి ఉన్నందున సినిమా థియేటర్లను ప్రారంభించడానికి తెరాస సర్కార్ అనుమతి నిరాకరించింది.