CM KCR With Jharkhand CM: దేశాన్ని సరైన దిశలో తీసుకెళ్లేందుకు చర్చలు మొదలయ్యాయని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రాంచీలో.. ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్‌తో కలిసి కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. హేమంత్ సోరేన్‌తో జాతీయ రాజకీయాలపై చర్చించామని కేసీఆర్ వెల్లడించారు. స్వాతంత్రం వచ్చి ఏళ్లు గడుస్తున్నా సరైన అభివృద్ధి జరగలేదన్న సీఎం.. దేశంలో మరింత మెరుగైన అభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు. దేశాభివృద్ధి కోసం ఏ మార్గాన్ని అనుసరించాలనే దానిపై ఆలోచిస్తున్నామని కేసీఆర్ చెప్పారు. దేశంలో ప్రత్యామ్నాయంపై త్వరలోనే నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు.
'దేశాన్ని సరైన దిశలో నడిపించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. చర్చలు జరుగుతున్నాయి. ఇది భాజపా, కాంగ్రెస్ వ్యతిరేక కూటమి కాదు. ఇప్పటివరకు ఏ కూటమి ఏర్పడలేదు. ఏం జరగబోతుందో కాలం నిర్ణయిస్తుంది. కానీ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా తర్వాత ఎంత అభివృద్ధి జరగాలో అంత జరగలేదు. దేశం మెరుగైన అభివృద్ధి సాధించాలని కోరుతున్నా. దేశాభివృద్ధి కోసం ఏ మార్గాన్ని అనుసరించాలనే దానిపై ఆలోచనలు కొనసాగుతున్నాయి. అందులో మీ పాత్ర కూడా అవసరం.'
- కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి