శ్రీశైలం (SRISAILAM) జలాశయం నుంచి జలవిద్యుత్తు ఉత్పత్తికి తెలంగాణ.. ఇక నుంచి నీళ్లు తీసు కోకుండా చూడాలని.. కృష్ణా నదీ(KRISHNA BOARD) యాజమాన్య బోర్డుకు మంగళవారం రాత్రి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో లేఖ పంపింది. ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీప్-ENC సి.నారాయణ రెడ్డి ఈ మేరకు బోర్డు కార్యదర్శికి లేఖ రాశారు. ఈ విషయంలో తెలంగాణ యంత్రాంగాన్ని నిలువరించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని మరోసారి విన్నవించారు. ఎన్నిసార్లు వద్దని చెబుతున్నా జలవిద్యుత్తు(HYDRO POWER) ఉత్పత్తి ఆపకపోగా ఇంకా పెంచుతూనే ఉన్నారని లేఖలో తెలిపారు. ఒక్క సోమవారం రోజనే 16వేల 877 క్యూసెక్కుల నీటిని జలవిద్యుత్ కోసం తీసుకున్నారని..లేఖలో వివరించారు. మరోవైపు వందశాతం జలవిద్యుత్తు ఉత్పత్తి చేయాలని తెలంగాణ(TELANGANA) ప్రభుత్వం జెన్కోను ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చిందని..అంటే శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్తు కేంద్రం నుంచి రోజుకు 4 టీఎంసీలు విద్యుత్తు ఉత్పాదన కోసం వాడేస్తారని దీని అర్థమని తెలిపారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను పూర్తిగా దెబ్బతీస్తుందని.. బోర్డుకు రాసిన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు.
నిబంధనలు ఉల్లఘించి వాడకం..
'వరదల సమయంలో మినహా మిగిలిన వేళల్లో శ్రీశైలం, నాగార్జునసాగర్(NAGARJUNASAGAR) ఉమ్మడి జలాశయాల నుంచి బోర్డు ఆదేశాలు లేకుండా నీటిని తీసుకోవడానికి వీల్లేదని.. అయినా ఎలాంటి ఆదేశాలూ లేకుండానే తెలంగాణ ఏకపక్షంగా శ్రీశైలం నుంచి నీటిని తీసుకుంటోంది. కనీసం కృష్ణా బోర్డుకు సమాచారం కూడా ఇవ్వడం లేదు. బోర్డు అధికారాలను గౌరవించకపోవడమే. ఉమ్మడి జలాశయాల నుంచి నీటి నిర్వహణ కోసం ఏర్పాటుచేసిన త్రిసభ్య కమిటీ నిర్ణయాల ప్రకారం ముందుకు వెళ్లాలన్న ఒప్పంద సూత్రాలను ఉల్లంగించినట్లే' అని ఈఎన్సీ తన లేఖలో వివరించారు.
ఖరీఫ్ నీటిని తెలంగాణ వాడేస్తోంది..