UTF LEADER: ప్రభుత్వంతో ఉపాధ్యాయుల చర్చలు విఫలం: యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు - utf leader venkateshwarlu latest news
08:18 February 06
ఉపాధ్యాయ సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం
UTF LEADER: ప్రభుత్వంతో ఉపాధ్యాయుల చర్చలు విఫలమైనట్లు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తెలిపారు. ఉపాధ్యాయ సంఘాలు ఏకతాటిపై వచ్చి పోరాడతామని స్పష్టం చేశారు. ప్రభుత్వంతో పీఆర్సీ సాధన సమితి చర్చలు ఆమోదయోగ్యం కాదన్న ఆయన.. ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిసి కార్యచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. హెచ్ఆర్ఏ, ఫిట్మెంట్ విషయాల్లో తీవ్రంగా విభేదించినట్లు తెలిపారు. ప్రభుత్వం టీచర్లుకు 10 శాతమే హెచ్ఆర్ఏ ఇస్తామంటోందన్న ఆయన.. ఉపాధ్యాయులకు కనీసం 12 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మార్పులు చేయకపోతే పాత హెచ్ఆర్ఏ కొనసాగించాలని కోరారు. ఫిట్మెంట్ విషయంలో ప్రభుత్వం స్పందించట్లేదని.. టీచర్లకు 27 శాతానికి పైగా ఫిట్మెంట్ కోరుతున్నట్లు చెప్పారు. ఫిట్మెంట్ విషయమై సీఎం వద్ద ప్రస్తావిస్తామని చెప్పామని.. అందుకు అవకాశం ఇవ్వబోమనడం అప్రజాస్వామికమని వెంకటేశ్వర్లు అన్నారు. సీపీఎస్‌కు సంబంధించి ప్రభుత్వ వైఖరి స్పష్టంగా చెప్పాలన్న ఆయన.. సీపీఎస్ పై నెల తర్వాత రోడ్ మ్యాప్ వేస్తామన్నారు. సీపీఎస్ పై కాలపరిమితి లేదా అగ్రిమెంట్ ఉండాలని చెప్పినట్లు వెంకటేశ్వర్లు వెల్లడించారు.
TAGGED:
utf leaders taza