ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గ్రేటర్ పోరులో ఒంటరి పోరే: తెతెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ - Telangana TDP president L Ramana f latest news

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్​.రమణ ప్రకటించారు. వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో తెదేపా అభ్యర్థులు బరిలో దిగుతారన్న ఆయన... నేడు, రేపో అభ్యర్థుల జాబితా విడుదల చేయనున్నట్లు తెలిపారు.

says ttdp president-ramana
says ttdp president-ramana

By

Published : Nov 17, 2020, 10:57 PM IST

ఈసారి జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్​.రమణ వెల్లడించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గత నెల రోజులుగా అనేక డివిజన్ల నేతలతో సమావేశాలను నిర్వహించామన్నారు.

స్థానికంగా బలమైన అభ్యర్థులను బరిలో దించనున్నట్లు పేర్కొన్నారు. వీలైనన్ని ఎక్కువస్థానాల్లో తెదేపా అభ్యర్థులు బరిలో దిగుతారన్న ఆయన... నేడు, రేపో అభ్యర్థుల జాబితా విడుదల చేయనున్నట్లు చెప్పారు. హైదరాబాద్​ను అభివృద్ధి చేసిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీదేనని... ఇక్కడ ఓటు అడిగే హక్కు తమకు మాత్రమే ఉందని రమణ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details