ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కక్షసాధింపు ధోరణితోనే సీబీ'ఐ'.. మీ అవినీతిపై విచారణ చెయ్యించండి' - ఏపీ ప్రభుత్వంపై కళా వెంకట్రావు విమర్శలు

రాష్ట్ర ప్రభుత్వం తెదేపా హయాంలో పథకాలపై సీబీఐ విచారణ చెయ్యించాలన్న నిర్ణయాన్ని... తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు తప్పుబట్టారు. కేవలం కక్ష సాధింపు ధోరణితోనే రాష్ట్ర కేబినెట్​ ఈ నిర్ణయం తీసుకుందని విమర్శించారు. ప్రస్తుతం అవినీతిమయమైన ఇళ్ల స్థలాలు, ఇసుక, మద్యం అక్రమాలపై ప్రభుత్వం సీపీఐ విచారణ జరిపించాలని డిమాండ్​ చేశారు. సరస్వతి పవర్​కు భూముల కేటాయింపుపైనా విచారణ జరగాలన్నారు.

'కక్షసాధింపు ధోరణితోనే సీబీ'ఐ'.. మీ అవినీతిపై విచారణ చెయ్యించండి'
'కక్షసాధింపు ధోరణితోనే సీబీ'ఐ'.. మీ అవినీతిపై విచారణ చెయ్యించండి'

By

Published : Jun 11, 2020, 5:17 PM IST

కక్ష సాధింపు ధోరణి, పొలిటికల్​ బ్లాక్​ మెయిలింగ్​ కొనసాగించే విధంగా రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాలున్నాయని... తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు. జే ట్యాక్స్​పై చర్చను మళ్లించి వ్యక్తిగత ప్రయోజనాల కోసమే తెదేపా పథకాలపై సీబీఐ విచారణ నిర్ణయం తీసుకున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు, ఇసుక, మద్యం అక్రమాలపై ప్రభుత్వం సీబీఐ విచారణ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. సరస్వతీ పవర్​కు భూముల కేటాయింపుపై సీబీఐతో విచారణ చెయ్యించాలని కళా వెంకట్రావు డిమాండ్‌ చేశారు. ప్రజల పొలాలకు వెళ్లాల్సిన నీటిని.. జగన్​ కుటుంబ సభ్యుల సంస్థ సరస్వతి పవర్​కు కేటాయించడంపైనా విచారణ జరగాలన్నారు.

జగన్ బాబాయ్ హత్య, కోడి కత్తి కేసులో.. ప్రభుత్వం ఎందుకు సీబీఐ విచారణకు ఆదేశించలేదని కళా వెంకట్రావు నిలదీశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు రూ.75 వేలు ఇస్తానని హామీ ఇచ్చి... రూ.50వేలకు కుదించడం మాట తప్పడం.. మడమ తిప్పడం కాదా అని ధ్వజమెత్తారు. హెరిటేజ్ ఏనాడూ చట్ట వ్యతిరేకంగా, ప్రజా ప్రయోజనాలకు విరుద్దంగా పని చేసిన చరిత్ర లేదని కళా స్పష్టం చేశారు. సాక్షి పత్రికకు ఇచ్చిన కోటాను కోట్ల యాడ్స్ పైనా సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details