ఆశావర్కర్లకు అండగా నిలబడ్డ వారిపై పోలీసులు దౌర్జన్యం చేయడం దారుణమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. పోలీసులు తమ తీరును మార్చుకోవాలన్నారు. కొంతమంది పోలీసు అధికారుల అత్యుత్సాహంతో మొత్తం పోలీస్ వ్యవస్థకు చెడ్డపేరు వస్తోందని తెలిపారు. 24 గంటలలోపు పిల్లి మాణిక్యాలరావుపై దాడి చేసిన పోలీసులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోందని అచ్చెన్న విమర్శించారు. వైకాపా ప్రభుత్వం పోలీసు అధికారులను అరాచకాలకు రాళ్లెత్తే కూలీలుగా మార్చిందని, పోలీసులే వైకాపాకు కీలు బొమ్మలయితే ప్రజలకు దిక్కెవరని ప్రశ్నించారు.