ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఉల్లి ధరలు పెరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది..?'

రాష్ట్రంలో ప్రస్తుతం ఉల్లిపాయలు, బంగారం సమానంగా ఉన్నాయని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఉల్లి ధరలు రోజురోజుకూ పెరుగుతూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు.

tdp protest in high rates of onions
ఉల్లి ధరలపై తెదేపా నిరసన

By

Published : Dec 9, 2019, 1:16 PM IST

ఉల్లి ధరలపై తెదేపా నిరసన

రాష్ట్రంలో ఉల్లి ధరలు పెరుగుతూ పోతుంటే ప్రభుత్వం.. ప్రజలను వారి కర్మకు వారిని వదిలేసిందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. సచివాలయం ఫైర్‌స్టేషన్‌ వద్ద ఉల్లిపాయల దండలు మెడలో వేసుకుని తెదేపా నేతలు నిరసన తెలిపారు. తక్కెడలో బంగారం, ఉల్లిపాయలు పెట్టి రెండూ సమానమేనని చూపి చంద్రబాబు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉల్లి ధరలు బంగారంతో సమానంగా ఉన్నాయన్నారు. ఉల్లి ధరలను ప్రభుత్వం నియంత్రించలేకపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ హయాంలో నిత్యావసర ధరలు పెరగకుండా చర్యలు తీసుకున్నామని.. రాయితీపై తక్కువ ధరలో ఉల్లి అందించామని గుర్తు చేశారు. ధరలు దిగొచ్చేవరకు తమ పోరాటం కొనసాగిస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details