ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'పాత పథకాలకు కొత్త పేర్లు తప్ప వైకాపా చేసిందేమీ లేదు' - వైఎస్​ఆర్​ బీమాపై అచ్చెన్నాయుడు కామెంట్స్

వైఎస్‌ఆర్‌ బీమాను కొత్త పథకంలా హడావిడి చేస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. పాత పథకాలకు పేరు మార్చడం తప్ప వైకాపా ప్రభుత్వం చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. తెదేపా హయాంలో చంద్రన్న బీమాను రెండున్నర కోట్లమందికి ఇచ్చామని గుర్తుచేశారు. బీమా అమలుకు అనేక ఆంక్షలతో లబ్ధిదారులను బాగా తగ్గించారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.

atcham naidu
atcham naidu

By

Published : Oct 21, 2020, 4:36 PM IST

చంద్రన్న బీమా పథకం లబ్ధిదారుల్ని గణనీయంగా తగ్గించి వైఎస్సార్ బీమా పేరుతో ప్రభుత్వం ప్రజల్ని మోసగిస్తోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. పేరు మార్చుకున్నా పర్లేదు కానీ ప్రతి అసంఘటిత కార్మికుడికి న్యాయం చేసేలా చంద్రన్న బీమా విధానాలన్నింటినీ కొనసాగించాలని డిమాండ్ చేశారు.

"చంద్రన్న బీమాను 2.5 కోట్లమందికి వర్తింపచేస్తే, పేరు మార్చిన వైఎస్సార్ బీమాలో 1.10 లక్షల మందికి దూరం చేశారు. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాన్ని వర్తింపచేసిన చంద్రన్న భీమాకు పేరు మార్చి సవాలక్ష ఆంక్షలతో లబ్ధిదారులను కుదించారు. ఇదేదో కొత్త పథకంలా జగన్ ప్రచార ఆర్భాటం చేస్తున్నారు."

--అచ్చెన్నాయుడు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు

పాత పథకాలకు పేర్లు మార్చి లబ్ధిదారులను తగ్గించటం తప్ప ఏడాదిన్నరో ఒక్క కొత్త పథకాన్ని వైకాపా ప్రభుత్వం ప్రవేశపెట్టలేదని అచ్చెన్న ఆరోపించారు. చంద్రబాబు పేరు మర్చిపోవాలనే 16 నెలల పాటు బీమాను అసంఘటిత కార్మికులకు దూరం చేశారన్నారు. ప్రమాదాలు, విపత్తుల కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఎంతోమంది పేదల కుటుంబాలకు ఏడాదిన్నరగా పరిహారం అందలేదని, దానికి ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు.

గతంలో.. రూ.15 ప్రీమియం కట్టి పేరు నమోదు చేసుకున్న ప్రతి అసంఘటిత కార్మికుడికి బీమా కల్పించామన్నారు. పేదలను సంక్షేమ పథకాలకు దూరం చేసే సలహాలు ఎవరిస్తున్నారని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. కుటుంబ పెద్ద మరణానికి మాత్రమే సాయం అందిస్తే మిగిలిన వారి పరిస్థితేంటని నిలదీశారు. వైఎస్సార్ బీమాకు, చంద్రన్న బీమాకు చాలా తేడా తేడా ఉందని ఆక్షేపించారు.

ఇదీ చదవండి:

విజయవాడ దుర్గగుడి వద్ద విరిగిపడిన కొండచరియలు

ABOUT THE AUTHOR

...view details