తనకు కొవిడ్ పాజిటివ్ వచ్చినందున.. వైద్యుల సలహా మేరకు 14 రోజులు హోమ్ క్వారంటైన్లో ఉండనున్నట్లు తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తెలిపారు. ఈ 14 రోజులు రాజకీయాలకు దూరంగా ఉంటానని తెలిపారు. తనకు దైవ సమానులైన తమ అధినేత చంద్రబాబు, అభిమానుల ఆశీస్సులతో కరోనాను జయించి, త్వరలోనే తిరిగి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటానని బుద్దా వెంకన్న అన్నారు.
తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నకు కరోనా - covid positive in budda venkanna
తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయన హోం క్వారంటైన్లో ఉండి చికిత్స చేయించుకుంటున్నారు.. ఈ మేరకు బుద్దా వెంకన్న తన ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించారు.
తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నకు కరోనా