ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెదేపాపై అసభ్య పోస్టులు పెడుతున్న వారిపై చర్యలేవీ? : బుద్ధా వెంకన్న - సీఐడీ అరెస్టులపై బుద్ధా వెంకన్న కామెంట్స్

ప్రపంచం మొత్తం కరోనాను ఎలా ఎదుర్కోవాలని చూస్తుంటే... రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం మాత్రం తెదేపాపై ఎలా కక్షసాధించాలో ఆలోచిస్తోందని తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. సామాజిక మాధ్యమాల్లో తెదేపా సానుభూతిపరులు ఒక్క లైక్​ కొట్టినా అరెస్టు చేస్తారన్న ఆయన... అసత్య పోస్టులు పెట్టి కోడెల మరణానికి కారకులపై చర్యలు తీసుకోలేదే అని ప్రశ్నించారు. లోకేశ్​ను ఏదో ఒక కేసులో ఇరికించి, చంద్రబాబును మానసికంగా దెబ్బకొట్టాలని జగన్​ ప్రయత్నిస్తున్నారని బుద్ధా వెంకన్న ఆరోపించారు.

బుద్ధా వెంకన్న
బుద్ధా వెంకన్న

By

Published : Jun 23, 2020, 3:42 PM IST

రాష్ట్రంలో ఏడాది కాలంగా ఇనుప సంకెళ్ల పాలన నడుస్తోందని తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శించారు. ఒక్క ఛాన్స్ తీసుకుని రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు క్షమించరని మండిపడ్డారు. సామాజిక మాధ్యమాల్లో సాక్ష్యాధారాలతో ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని, తెదేపా నాయకులపై అసభ్య పదజాలంతో పోస్టింగులు పెడుతున్న వారిని వదిలేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రాన్ని జగన్ పరిపాలిస్తున్నారో, రాక్షసులు పాలిస్తున్నారో అర్థంకావడం లేదని దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయడం ఎవరి తరం కాదని తేల్చి చెప్పారు. రాజధాని మార్చడమంటే.. రంగులు మార్చినంత సులువు కాదన్నారు. పైకి ప్రత్యేక హోదా.. లోపల కేసుల మాఫీ కోసం జగన్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. నారా లోకేశ్​ని ఏదోవిధంగా అక్రమ కేసులో ఇరికించి జైలుకు పంపాలని జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. చంద్రబాబుని మానసికంగా వేధించాలని చూస్తే.. ప్రపంచంలోని తెలుగు వారంతా తిరగబడతారని బుద్ధా వెంకన్న అన్నారు.

ఇదీ చదవండి :'అవినీతి చేసిన వాళ్లను వదిలేసి.. ప్రశ్నించిన వారిపై కేసులు'

ABOUT THE AUTHOR

...view details