తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి ఆయన తనయుడు కరణం వెంకటేష్‌తో సహా ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం కలిశారు. ముఖ్యమంత్రితో సమావేశానంతరం బలరాం తనయుడు కరణం వెంకటేష్ వైకాపాలో చేరారు. జగన్ ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. కరణం బలరాం అధికారికంగా వైకాపాలో చేరకుండా, కుమారుణ్ని చేర్పించి వెళ్లిపోయారు. గన్నవరం, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాల ఎమ్మెల్యేల తరహాలోనే బలరాం ఉండబోతున్నారని వైకాపా వర్గాలు చెబుతున్నాయి.
సీఎం జగన్‌తో కరణం బలరాం భేటీ
ప్రకాశం జిల్లాలో తెదేపాకు మరో షాక్ తగిలింది. ఇటీవలే కదిరి బాబూరావు వైకాపా తీర్థం పుచ్చుకోగా కరణం బలరాం తనయుడు అదే బాటలో వెళ్లారు. కరణం బలరాం అధికారికంగా వైకాపాలో చేరకపోయినప్పటికీ... గన్నవరం, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాల ఎమ్మెల్యేల తరహాలోనే ఉండబోతున్నారని తెలుస్తోంది.
tdp mla karanam balaram joined in ysr congress